logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కరోనా వైద్యానికి కాల్ సెంటర్ సేవలు.. ఎలా పనిచేస్తాయంటే?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైద్యానికి కాల్ సెంటర్ సేవలను వినియోగిస్తున్నారు. అందుకోసం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎవరికైనా కరోనా పాజిటివ్ గా తేలితే వారిని కాల్ సెంటర్ సిబ్బంది అనునిత్యం ఫాలో అప్ చేసి వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటారు. ఫోన్ ద్వారా వారికి మందులు, ఇతర జాగ్రత్తలను సూచిస్తారు.

కరోనా పేషంట్లకు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తారు. రోగులు సాధారణ స్థితికి చేరుకునే వరకు 17 రోజుల పాటు ఈ సేవలను అందిస్తారు. రెండు విడతతలో 200 వందల మంది సిబ్బందితో నిరంతరాయంగా ఈ కాల్ సెంటర్ పని చేస్తుంది. ప్రతి రోజు 500 మంది రోగులను ప్రాధాన్యతగా చేసుకుని టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సలహాలను అందజేస్తున్నారు. ఐసోలేషన్ లో ఉన్న రోగితో పాటుగా వారికి సేవలు అందిస్తున్న వారికి కూడా జాగ్రత్తలతో కూడిన సూచనలు తెలియజేస్తారు.

ఇక కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండి, ఛాతీ నొప్పి, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారికి 108 అత్యవసర వాహనాల ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రికి తరలిస్తారు. కరోనాకు సంబందించిన సేవలను ఉపయోగించుకోవాలనుకునే వారు, ఇతర సందేహాలు నివృత్తి చేసుకునే వారు 18005994455 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

Related News