logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కొవాగ్జిన్ సామర్థ్యంపై ఐసీఎంఆర్ కీలక ప్రకటన.. భారీగా పెరగనున్న వాక్సిన్ ఉత్పత్తి

కరోనా సెకండ్ వేవ్ లో రోజుకో కొత్త వేరియంట్ పుట్టుకొస్తుంది. ఈ వార్తలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఓ దశలో కొత్త వేరియంట్లపై ఇప్పుడు అందుబాటులో ఉన్న వాక్సిన్ లు ప్రభావాన్ని చూపలేవనే ప్రచారం కూడా జరిగింది. కానీ అవన్నీ అవాస్తవాలే అని రుజువైంది. తాజాగా ఐసిఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) కీలక ప్రకటన చేసింది. కరోనా కొత్త వేరియంట్లపై భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్టుగా ప్రకటించింది.

సార్స్ కోవ్ -2 తో పాటుగా అందులో వచ్చిన కొత్త మ్యుటెంట్లను కూడా కొవాగ్జిన్ అడ్డుకోగలదని, ప్రస్తుతం భారత్ లో ఉన్న డబుల్ మ్యుటెంట్ పై కూడా కొవాగ్జిన్ బలంగా పనిచేస్తుందని ఇసిఎంఆర్ తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం యూకే, బ్రెజిల్ లో తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ లను, భారత్ లో ఉన్న డబుల్ మ్యుటెంట్ వైరస్లను బందించి కల్చర్ చేయడం ద్వారా ఈ విషయాన్ని నిర్దారించినట్టుగా తెలిపారు.

ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే కోవిడ్ వాక్సిన్ ఊపిరితితుల్లోని కింది భాగాన్ని రక్షిస్తాయని పై భాగాన్ని కాదని తెలిపారు. దాని వల్ల వాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ శరీరంలోకి ప్రవేశించినా తీవ్రత తక్కువగా ఉంటుందని, ఊపిరితితులపై తీవ్ర ప్రభావం చూపలేదని భారత్ బయోటెక్ ఛైర్మెన్ కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. వాక్సిన్ తీసుకున్నా కరోనా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో భారత్ లో కొవాగ్జిన్ ఉత్పత్తిని మరింత పెంచే విధంగా భారత్ బయోటెక్ కృషి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మరో 60 దేశాల్లో కొవాగ్జిన్ టీకాకు అనుమతులు తీసుకునేందుకు భారత్ బయోటెక్ ప్రయత్నాలు చేస్తుంది. అందులో ఇప్పటికే పలు దేశాలు కొవాగ్జిన్ కు అత్యవసర అనుమతులు ఇచ్చాయి.

Related News