logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ఈ దంపతులు యమ డేంజర్..  డేటింగ్ పేరుతో రూ. 21 లక్షలు దోచేశారు!

రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఎన్ని ఘటనలు జరుగుతున్నా కొత్తగా బాధితులు పుట్టుకొస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో ఘరానా మోసం బయటపడింది. నగరంలోని నెరేడ్ మెట్ ప్రాంతానికి చెందిన డోనాల్డ్ హోరాసిస్ రోజారియే అనే వ్యక్తికి ఇండియన్ డేటింగ్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ లో ఓ అందమై యువతి పరిచయమైంది. ప్రొఫైల్ పిక్చర్ అందంగా ఉండటంతో ఆమెతో రోజూ చాటింగ్ లో మునిగితేలాడు.

అలా వివిధ కారణాలకు గాను మొత్తం రూ. 21 లక్షలు ఆమెకు చెల్లించాడు. ఇక పెళ్లి మాట ఎత్తేసరికి అవతలివైపు నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇక పోలీసుల విచారణలో విస్తుపోయి విషయాలు వెలుగుచూశాయి. ఇప్పటివరకు అతను చాటింగ్ చేసింది ఓ అబ్బాయితో అని పోలీసులు వెల్లడించారు.

వివరాలను పరిశీలిస్తే.. విజయవాడకు చెందిన కంపా హృదయానంద్ 2017లో అనూష అలియాస్ హారికను పెళ్లిచేసుకున్నాడు. హరికకు అంతకుముందే ఓ వ్యక్తితో పెళ్ళై విడాకులు కూడా తీసుకుంది. రెండో పెళ్లి తర్వాత హృదయానంద్ కు గుండె జబ్బు చేసి ఏ పని చేయలేకపోయాడు. హారిక ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉద్యోగానికి చేరింది. వస్తున్న ఆదాయం చాలకపోవడంతో ఈ దంపతులిద్దరూ కలిసి ఓ డేటింగ్ యాప్ లో అమ్మాయి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు.

ఈ నేపథ్యంలో బాధితుడితో హృదయానంద్ అమ్మాయిలా మారి చాట్ చేసేవాడు. తన తల్లి మరణించిందని, చెల్లిని ఆసుపత్రిలో చేర్పించామని చెప్పి అతని దగ్గర రూ. 21 లక్షలు కాజేశారు. ఇటీవల వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు దంపతులిద్దరినీ విజయవాడకు వెళ్లి అరెస్టు చేసి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

 

Related News