logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

అతి తక్కువ ధరకే కరోనా టెస్టింగ్ కిట్.. 3 గంటల్లో ఫలితం!

కరోనా లక్షణాలు బయటకు కనిపించకపోవడం వల్ల చాలా మంది సరైన సమయంలో ఈ మహమ్మారి సోకిన విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. కొన్ని సార్లు ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అలాగని ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలంటే వేలల్లో జేబులు ఖాళీ చేస్తున్నారు. ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నా కరోనా భయంతో ఆసుపత్రి దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా జనాలు హడలిపోతున్నారు. దీంతో ఇంటి వద్దనే అత్యంత వేగంగా కరోనా పరీక్షలను నిర్వహించడంతో పాటుగా గంటల వ్యవధిలోనే ఫలితాన్ని చూసుకునే విధంగా భారతీయ విద్యార్థులు కరోనా టెస్టింగ్ కిట్ కనుగొన్నారు.

ఢిల్లీ ఐఐటీకి చెందిన పరిశోధన విద్యార్థులు ఈ పరికరాన్ని అభివృద్ధి చేసారు. ‘కోరోష్యుర్’ పేరుతో 9 మంది రీసెర్చ్ స్కాలర్స్ దీనిని రూపొందించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ చేతుల మీదుగా ఈ టెస్టింగ్ కిట్ ను మార్కెట్లోకి విడుదల చేసారు. ఇప్పటికే దీనికి ఐసీఎమ్ ఆర్ ఆమోదం కూడా లభించింది. ఈ టెస్టింగ్ కిట్ ధర విషయానికొస్తే.. రూ. 399 గా ఉంది. అయితే ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్, శాంపిల్ కలెక్షన్ వంటి వాటితో కలుపుకుని రూ. 700లోపు లభ్యమవుతుంది.

పరీక్షలు జరిపిన 3 గంటలోపే ఫలితాలను తెలుసుకోవచ్చు. ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ వి.రామ్‌గోపాలరావు మాట్లాడుతూ.. ఇది పూర్తిగా దేశీయ పరికరాలతో రూపొందించామని పేర్కొన్నారు. ఈ టెస్టింగ్ కిట్ కు ఐసీఎంఆర్ అత్యధిక స్కోరుతో ఆమోదం తెలిపిందని, డీసీజీఐ ఆమోదం కూడా లభించిందన్నారు. కాగా కరోనా నియంత్రణ పరిశోధనల్లో భాగంగా అశ్వగంధ కరోనాను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేసున్నట్టుగా గుర్తించామన్నారు.

Related News