కరోనాకు మందు కనిపెట్టామని పతంజలి వ్యవస్థాపకుడు, యోగా గురువు రామ్ దేవ్ బాబా ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనీల్ పేరుతో విడుదల చేసిన ఈ కరోనా కిట్ ఇప్పటికే 280 కరోనా పేషంట్లపై ప్రయోగించామని వారంతా 4 నుంచి 7 రోజుల్లోగా తిరిగి మామూలు స్థితికి చేరుకున్నారని వెల్లడించారు. మంగళవారం నాడు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో బాబా రామ్ దేవ్ ఈ ఔషధాన్ని తన చేతుల మీదుగా విడుదల చేశారు.
కాగా ఈ ఔషధానికి కేంద్ర ఆయుష్ శాఖ బ్రేకులు వేసింది. ఈ ఔషధంపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో ఆయుష్ శాఖ దీనిపై స్పందించింది. కరోనీల్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్, శాస్త్రేయత ను పరీక్షించవలసి ఉందని కరోనాకు ముందుగా దీనిని ఇప్పుడే నివారించలేమని స్పష్టం చేసింది. కరోనీల్ కు సంబందించిన పూర్తి వివరాలను తమకు అందజేయాలని ఆయుష్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అంతేకాదు తాము నిర్దారించేవరకు ఈ ఔషధం వాడకంపై ఎలాంటి ప్రకటనలు, పంపిణీ వంటివి చేయకూడదని ఆదేశించింది.