logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది ? భార‌త్‌లో వ్యాక్సిన్ ధ‌ర ఎంత ?

స‌రిగ్గా ఎనిమిది నెల‌ల క్రితం ఎక్క‌డో చైనాలోని ఓ మార్కెట్‌లో పుట్టిన క‌రోనా వైర‌స్ ఇవాళ మ‌న వీధిలోకి, మ‌న ఇంట్లోకి వ‌చ్చేసింది. దేశంలో ఇప్ప‌టికే 40 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇటువంటి స‌మ‌యంలో క‌రోనాకు వ్యాక్సిన్ ఒక్క‌టే అడ్డుక‌ట్ట వేయ‌గ‌ల‌ద‌ని అందరూ ఆశ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు క‌రోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుంది ? విదేశీ సంస్థ‌లు అభివృద్ధి చేసే వ్యాక్సిన్ భార‌త్‌కు రావ‌డానికి ఎంత‌కాలం ప‌ట్ట‌వ‌చ్చు ? భార‌త్‌కు వ్యాక్సిన్ వ‌స్తే ధ‌ర ఎంత ఉంటుంది ? అనే ర‌క‌ర‌కాల ప్రశ్న‌లు త‌లెత్తుతున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు ర‌ష్యా క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని ప్ర‌క‌టించింది. ఈ వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్ వి. మొద‌టి విడ‌త ప్ర‌జ‌ల‌కు ఇచ్చేందుకు కావాల్సిన వ్యాక్సిన్‌ల‌ను ఆ దేశం సిద్ధం చేసింది. మొద‌ట‌గా ర‌ష్యా ప్ర‌జ‌ల‌కే ఈ వ్యాక్సిన్‌ను అందించ‌నున్నారు. అయితే, మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ స‌రిగ్గా పూర్తి చేయ‌లేద‌ని వాద‌న ఉండ‌టంతో ర‌ష్యా వ్యాక్సిన్ వైపు ఎవ‌రూ పెద్ద‌గా చూడ‌టం లేదు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 160 సంస్థ‌లు క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ త‌యారీకి శ్ర‌మిస్తున్నాయి. ఇందులో 30కి పైగా వ్యాక్సిన్‌లు అభివృద్ధి అయ్యి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉన్నాయి. చైనా ప్ర‌భుత్వ సంస్థ అయిన సినోఫార్మ్ కూడా క‌రోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తి చేసుకుంది. డిసెంబ‌ర్‌లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చైనా చెబుతోంది. ఈ వ్యాక్సిన్ ధ‌ర భార‌త క‌రెన్సీలో సుమారు ఒక్కో డోసుకు రూ.10,800 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. రెండు డోసుల్లో ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు.

అయితే, ఇత‌ర దేశాల్లో అభివృద్ధి అవుతున్న వ్యాక్సిన్‌లు ముందుగా ఆయా దేశ ప్ర‌జ‌ల‌కు ఇచ్చేందుకు ప్రాధాన్య‌త ఉంటుంది. కాబ‌ట్టి, భార‌త్‌కు ఆ వ్యాక్సిన్‌లు అంత త్వ‌ర‌గా రావు. భార‌త్‌లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్న వ్యాక్సిన్‌లే భార‌త్‌కు త్వ‌ర‌గా వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. ఆక్స్‌ఫ‌ర్ట్ యూనివ‌ర్సిటీ – ఆస్ట్రాజెనికా సంస్థ‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పైన భార‌త్‌తో పాటు ప్ర‌పంచ‌మంతా ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నారు.

ప్ర‌స్తుతం ఈ వ్యాక్సిన్ మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో ఉంది. భార‌త్‌లోనూ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్‌ను భార‌త్‌లోని పూణేకు చెందిన సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్ప‌త్తి చేయ‌డానికి ఒప్పందం కుదిరింది. ఇది భార‌తీయుల‌కు ఒక శుభ‌వార్త లాంటి. సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్ప‌త్తి చేసే వ్యాక్సిన్‌ల‌లో ముందుగా భార‌తీయుల‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. కాబ‌ట్టి, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ఎంత త్వ‌ర‌గా అందుబాటులోకి వ‌స్తే అంత త్వ‌ర‌గా భార‌తీయుల‌కు వ్యాక్సిన్ ల‌భించే అవ‌కాశం ఉంది.

పైగా ఈ వ్యాక్సిన్ ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌బోతోంది. కేవ‌లం మూడు డాల‌ర్లు అంటే భార‌తీయ క‌రెన్సీలో 225 రూపాయ‌ల‌కే వ్యాక్సిన్ ఇస్తామ‌ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్ర‌క‌టించింది. దీంతో ఈ వ్యాక్సిన్ కోసం ఎక్కువ‌గా ఆశ‌లు ఉన్నాయి. భార‌త్‌లోనే హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్‌, అహ్మ‌దాబాద్‌కు చెందిన జైడ‌స్ కాడిలా సంస్థ‌లు కూడా వ్యాక్సిన్‌ను త‌యారుచేశాయి. ప్ర‌స్తుతం ఇవి రెండో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో ఉన్నాయి. అయితే, వీటి ధ‌ర‌పై మాత్రం ఇప్పుడే ఒక ప్ర‌క‌ట‌న చేయ‌లేమ‌ని ఆ సంస్థ‌లు చెబుతున్నాయి. కానీ, ఈ వ్యాక్సిన్‌లు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంటే భార‌తీయుల‌కు వేగంగా వ్యాక్సిన్ అందే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే.. భార‌తీయుల‌కు వ్యాక్సిన్ అందాలంటే ఆక్స్‌ఫ‌ర్డ్ – ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ లేదా మ‌న దేశానికే చెందిన భార‌త్ బ‌యోటెక్‌, జైడ‌స్ కాడిలా వ్యాక్సిన్‌లు త్వ‌ర‌గా పూర్తికావాలి. ఎంత వేగంగా ఈ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతంగా పూర్తై, అనుమ‌తులు వ‌చ్చినా క‌నీసం వ్యాక్సిన్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రావ‌డానికి క‌చ్చితంగా 2021 జ‌న‌వ‌రి వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ధ‌ర విష‌యానికి వ‌స్తే ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్ అయితే రూ.225 మాత్ర‌మే ఉండ‌వ‌చ్చు. ఆస్ట్రేలియా అయితే త‌మ పౌరుల‌కు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. మ‌న భార‌త ప్ర‌భుత్వం ఈ విష‌య‌మై ఇంకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

 

Related News