logo

  BREAKING NEWS

మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |  

అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు

వ్యాక్సిన్ ఒక్క‌టే క‌రోనా నుంచి పూర్తిగా ర‌క్షిస్తుంద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో నెల‌కొంది. దీంతో వ్యాక్సిన్‌పైన జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌లు, క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌పైన అంద‌రూ దృష్టి పెట్టారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చేశాక వేయించుకొని ఇక మాస్కులు తీసి ప‌క్క‌న ప‌డేసి క‌రోనాకు దూరంగా హాయిగా ఉండొచ్చ‌ని అంతా భావిస్తున్నారు. కానీ తాజాగా భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి(ఐసీఎంఆర్) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ బ‌ల‌రాం భార్గ‌వ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.

వ్యాక్సిన్ వ‌చ్చాక అది దేశ ప్ర‌జ‌లంద‌రూ తీసుకోవాల్సి ఉంటుంద‌ని ఇప్ప‌టివ‌ర‌కు అంతా అనుకుంటున్నారు. అందుకే దీని ధ‌ర ఎంత ఉంటుంది, ప్ర‌భుత్వ‌మే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందా అనే విష‌యాల‌ను తెలుసుకోవ‌డానికి ప్ర‌జ‌లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. కానీ, బ‌ల‌రాం భార్గ‌వ మాత్రం అస‌లు దేశంలో అంద‌రికీ క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవ‌సరం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా వైర‌స్ సంక్ర‌మించే చైన్‌ను తెంచి వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవ‌డ‌మే వ్యాక్సిన్ ముఖ్య ఉద్దేశమ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ కూడా ఇటువంటి వ్యాఖ్య‌లే చేశారు. దేశం మొత్తానికి క‌రోనా వ్యాక్సిన్ ఇస్తామ‌ని ప్ర‌భుత్వం ఎప్పుడూ చెప్ప‌లేద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్రం రూపొందిస్తోంద‌ని, త్వ‌ర‌లోనే ఇవి రాష్ట్రాల‌కు పంపిస్తుద‌ని ఆయ‌న తెలిపారు.

ఇదే అంశంపై ఐసీఎంఆర్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ బ‌ల‌రాం భార్గ‌వ మాట్లాడుతూ… వ్యాక్సిన్ కొంద‌రిలో 60 శాతం, మ‌రికొంద‌రిలో 70 శాతం వ‌ర‌కు ప‌ని చేస్తుంద‌ని తెలిపారు. వ్యాక్సిన్ సామ‌ర్థ్యం బ‌ట్టి క‌రోనా వ్యాప్తి చైన్‌ను తెంచ‌డానికి ఎంత‌మందికి వ్యాక్సిన్ ఇవ్వాల‌నేది ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వైర‌స్ వ్యాప్తిని నివారించ‌గ‌లిగితే వ్యాక్సిన్ ప్ర‌జ‌లంద‌రికీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. అంతేకాదు, వ్యాక్సిన్ వ‌చ్చిన త‌ర్వాత కూడా కొంత‌కాలం పాటు మాస్కుల‌ను కొన‌సాగించాల్సి ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.

ప్రస్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 64 కంపెనీల క‌రోనా వ్యాక్సిన్‌లు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉన్నాయి. వ‌చ్చే సంవ‌త్స‌రం వేస‌వి నాటికి సుమారు 10 వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌న దేశంలో ప్ర‌భుత్వం మొద‌టి విడ‌త‌లో క‌రోనా వారియ‌ర్స్ అయిన డాక్ట‌ర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సినేష‌న్ చేయించ‌నుంది. ప్ర‌జ‌లకు వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తారా లేదా అనేది ప్ర‌భుత్వం ఇంకా స్ప‌ష్టం చేయ‌లేదు.

Related News