logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

బ్రేకింగ్‌: దేశంలో క‌రోనా వ్యాక్సిన్ పంపిణీకి డేట్ ఫిక్స్‌

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ పంపిణీకి ప్ర‌భుత్వం డేట్ ఫిక్స్ చేసింది. సంక్రాంతి పండుగ త‌ర్వాత జ‌న‌వ‌రి 16వ తేదీ నుంచి వ్యాక్సినేష‌న్ ప్రారంభించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఇవాళ క‌రోనా వ్యాక్సినేష‌న్‌కు సంబంధించి ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కీల‌క స‌మావేశం నిర్ణయించారు. వ్యాక్సినేష‌న్‌కు దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన ఏర్పాట్ల‌ను ప్ర‌ధాని తెలుసుకున్నారు.

వ్యాక్సినేష‌న్ కోసం ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే డ్రై ర‌న్ జ‌రుగుతోంది. డ్రైర‌న్ విజ‌య‌వంతంగా జ‌ర‌గ‌డంతో వ్యాక్సినేష‌న్ ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మొద‌టి విడ‌త‌లో భాగంగా దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందించ‌నున్నారు.

ఇందులో కోటి మంది ప్రభుత్వ‌, ప్రైవేటు వైద్య సిబ్బందికి, 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్‌కు, 27 కోట్ల మంది 50 ఏళ్లు పైబ‌డిన వారు, 50 ఏళ్ల లోపు దీర్ఘ‌కాలిక వ్యాధిగ్ర‌స్థుల‌కు వ్యాక్సినేష‌న్ చేయ‌నున్నారు. వ్యాక్సిన్‌ను రాష్ట్రాల‌కు పంపించ‌డానికి కేంద్రం ఇప్ప‌టికే ఏర్పాట్లు చేయించింది. ప్ర‌త్యేక విమానాల్లో వ్యాక్సిన్ అన్ని రాష్ట్రాల‌కు రానుంది.

Related News