logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?

క‌రోనా వైర‌స్ కేసులు ప‌దుల సంఖ్య‌లో ఉన్న‌ప్పుడు మ‌న‌మంతా చాలా భ‌య‌ప‌డ్డాం. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. మాస్కు లేనిదే ఇంటి గ‌డ‌ప దాట‌లేదు. శానిటైజర్ వినియోగించాం. భౌతిక దూరం పాటించాం. ఇన్ని చేసినా క‌రోనా కేసుల సంఖ్య‌లో ప్ర‌పంచంలోనే మ‌న దేశం రెండో స్థానంలో ఉంది. అయితే, ఇప్పుడు క‌రోనా పాజిటీవ్ కేసుల సంఖ్య దేశంలో క్ర‌మంగా త‌గ్గుతోంది. నెల రోజుల క్రితం ప్ర‌తీ రోజు ల‌క్ష వ‌ర‌కు పాజిటీవ్ కేసులు న‌మోదు కాగా ఇప్పుడు 50 వేల లోపే న‌మోద‌వుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా పాజిటీవ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతోంది. దీంతో అంతా బాగుంద‌ని, క‌రోనా పీడ విర‌గ‌డైంద‌నే భావ‌న మ‌న‌లో ఏర్ప‌డింది. క‌రోనా ఇక మ‌న‌ల్ని ఏమీ చేయ‌లేద‌ని అభిప్రాయం వ‌చ్చేసింది. ఈ అతి విశ్వాసంతోనే మ‌న‌లో చాలా మంది మాస్కులు ధ‌రించ‌డం మానేస్తున్నారు. భౌతిక దూరం మాటే మ‌రిచిపోయి గుంపులుగా చేరుతున్నారు. శానిటైజ‌ర్‌ల వాడ‌కం కూడా త‌గ్గించేశారు.

నిజంగానే మ‌న‌కు క‌రోనా ముప్పు తొల‌గిపోతే ఇలా చేసినా ఏం కాదు కానీ ఇంకా క‌రోనా ముప్పు మ‌న‌కు పొంచి ఉంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వైర‌స్ మాన‌వాళిపై దాడి చేసిన‌ప్పుడు ద‌శ‌ల‌వారీగా దాడి చేస్తుంది. దీనిని మ‌ల్టిపుల్ వేవ్స్ అంటారు. ఇప్పటి వ‌ర‌కు క‌రోనా విష‌యంలో మ‌నం చూసింది ఫ‌స్ట్ వేవ్ మాత్రమే. ఫ‌స్ట్ వేవ్‌లో క‌రోనా కేసుల క‌ర్వ్ పెరిగి ఇప్పుడు క్ర‌మంగా త‌గ్గుతోంది. అంత మాత్రాన ఇక క‌రోనా పూర్తిగా దూర‌మైన‌ట్లు కాద‌ని వైద్య నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అస‌లు ముప్పు ఇక ముందు ఉంటుంద‌ని, సెకండ్ వేవ్ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఒక‌సారి మ‌న స‌మాజంలో క‌రోనా ప్ర‌భావం తగ్గిపోయిన త‌ర్వాత మ‌ళ్లీ ఇంకోసారి విజృంభిస్తుంది. దీనినే వేవ్స్ అంటారు. న‌వంబ‌ర్ చివ‌ర్లో లేదా డిసెంబ‌ర్ మొద‌ట్లో మ‌న దేశంలో సెకండ్ వేవ్ మొద‌ల‌య్యే సూచ‌న‌లు ఉన్నాయ‌ని వైద్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఇందుకు ముఖ్యంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాం. ఒక‌టి ఇది పండుగ‌ల సీజ‌న్. ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌ల‌ను మ‌రిచిపోయి బ‌య‌ట‌కు వెళుతున్నారు. ఇంకో ముఖ్య కార‌ణం రానున్న‌ది చ‌లికాలం కావ‌డం. సాధార‌ణంగా ఏ వైర‌స్ అయినా ఎండాకాలంలో కొంత బ‌ల‌హీనంగా ఉంటుంది. చ‌లికాలంలో దాని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ఇప్పుడు దేశంలో చ‌లికాలం ఆరంభం కావ‌డంతో క‌రోనా ప్ర‌భావం సేకెండ్ వేవ్‌లో కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

ఇప్ప‌టికే ప‌లు యూరోపియన్ దేశాల్లో క‌రోనా సెకండ్ వేవ్ మద‌లుకావ‌డంతో ఆయా దేశాల్లో త‌గ్గిన‌ట్లే త‌గ్గిన క‌రోనా ఉధృతి మ‌ళ్లీ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌నం సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవాలంటే క‌రోనా నిబంధ‌న‌ల‌ను మ‌రికొంత కాలం పాటించాల‌ని, వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు అజాగ్ర‌త్త వ‌ద్ద‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Related News