logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

స్మార్ట్‌ఫోన్లు, క‌రెన్సీ నోట్ల‌పై క‌రోనా వైర‌స్ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా ?

తుంప‌ర్ల ద్వారా క‌రోనా వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోకుతుంది. ఇదే కాకుండా క‌రోనా సోకిన వ్య‌క్తి ముట్టుకున్న ఏ వ‌స్తువును అయినా ఇత‌రులు ముట్టుకుంటే వాటి ద్వారా కూడా వైర‌స్ సోకుతుంది. దీంతో ఏ వ‌స్తువు పైన ఎన్ని రోజులు క‌రోనా వైర‌స్ జీవించి ఉంటుంద‌నే అంశాల‌పై ప‌లు ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఓ వైరాలజీ జ‌ర్నల్‌లో ఈ ప‌రిశోధ‌న‌కు సంబంధించి కీల‌క విష‌యాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి.

ఆస్ట్రేలియ‌న్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ ప్రీపేర్డ్‌నెస్ అనే సంస్థ క‌రోనా వైర‌స్ ఎక్క‌డ, ఎంత సేపు జీవించి ఉంటుంది అనే దానిపై ప‌రిశోధ‌న జ‌రిపింది. క‌రెన్సీ నోట్లు, స్మార్ట్ ఫోన్లు, ఇత‌ర అద్దంతో త‌యారైన వ‌స్తువులు, స్టీల్ వ‌స్తువుల‌‌పై క‌రోనా వైర‌స్ 28 రోజుల పాటు నిలిచి ఉంటుంద‌ని ఈ ప‌రిశోధ‌న‌లో తెలడం కొంత ఆందోళ‌న క‌లిగిస్తోంది. రూమ్ టెంప‌రేచ‌ర్ అంటే 20 డిగ్రీల సెల్సియ‌స్‌లో మొబైల్ ఫోన్లు, క‌రెన్సీ నోట్ల‌పై క‌రోనా వైర‌స్ 28 రోజుల పాటు జీవించి ఉండ‌గ‌ల‌ద‌ని ప‌రిశోధ‌కులు ప్ర‌క‌టించారు. 30 – 40 డిగ్రీల మ‌ధ్య వాతావ‌ర‌ణం ఉంటే మాత్రం కొంత త్వ‌ర‌గా వైర‌స్ మ‌ర‌ణిస్తుంద‌ని తెలిపారు.

ఏ వ‌స్తువుపైన క‌రోనా వైర‌స్ ఎంత కాలం పాటు జీవించి ఉంటుంద‌నేది తెలుసుకునేందుకు గానూ నెల రోజుల పాటు ఈ ప‌రిశోధ‌న నిర్వ‌హించారు. ఈ ప‌రిశోధ‌న ఫ‌లితాల‌ ప్ర‌కారం చూస్తే మొబైల్ ఫోన్లు, క‌రెన్సీ నోట్ల‌ను వాడే విష‌యంలోనూ ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. క‌రెన్సీ నోట్లను వీలైనంత వ‌ర‌కు త‌క్కువ‌గా వినియోగించ‌డం మంచిది.

ప్ర‌స్తుతం మ‌న‌కు డిజిట‌ల్ బ్యాంకింగ్ అందుబాటులో ఉంది. టీ తాగినా కూడా గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్‌ల ద్వారా డ‌బ్బులు ఇవ్వ‌వచ్చు. ప్ర‌భుత్వం కూడా డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హిస్తోంది. ఇత‌ర కార‌ణాల సంగ‌తి ప‌క్క‌న పెడితే క‌రోనా వైరస్ నుంచి సేఫ్‌గా ఉండ‌టానికి మ‌నం కూడా క‌రెన్సీ నోట్ల‌ను అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప వినియోగించ‌కుండా, డిజిట‌ల్ పేమెంట్స్ అవ‌కాశాన్ని వినియోగించుకుంటే మంచిది.

మొబైల్ ఫోన్‌ల ద్వారా క‌రోనా సోకే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంద‌ని వైద్యులు చాలా రోజులుగా చెబుతున్నారు. అందుకే చాలావ‌ర‌కు ఆసుప‌త్రుల్లో హెల్త్ వ‌ర్క‌ర్స్ మొబైల్ ఫోన్లు వాడ‌కుండా ఆంక్ష‌లు పెడుతున్నారు. మ‌నం బ‌య‌ట ఎక్క‌డైనా ముట్టుకొని ఫోన్ వ‌స్తే చేతుల‌ను శానిటైజ్ చేసుకోకుండానే జేబులో నుంచి ఫోన్ తీసి మాట్లాడ‌తాం. ఇలా చేసిన‌ప్పుడు మ‌న చేతికి వైర‌స్ ఉంటే మొబైల్‌కు అంటుకుంటుంది. మొబైల్‌కు వైర‌స్ ఉంటే అది మ‌న‌కు సోకే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి, చేతులు శానిటైజ్ చేయ‌కుండా ఎట్టి ప‌రిస్థితుల్లో మొబైల్ ఫోన్ ముట్టుకోవ‌ద్ద‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Related News