logo

  BREAKING NEWS

క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |   క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |  

వ్యాక్సిన్ వ‌చ్చినా క‌రోనా ఇక ఎప్ప‌టికీ మ‌న‌తోనే ఉంటుంద‌ట‌

క‌రోనా వైర‌స్ ప్రభావం రోజురోజుకూ పెర‌గ‌డ‌మే కానీ త‌గ్గ‌డం మాత్రం లేదు. ఇదే స‌మ‌యంలో క‌రోనాపై భ‌యం మాత్రం ప్ర‌జ‌ల్లో రోజురోజుకూ త‌గ్గిపోతోంది. క‌రోనా వైర‌స్ వ‌చ్చిన మొద‌ట్లో విప‌రీతంగా ఆందోళ‌న చెందిన ప్ర‌జ‌లు ఇప్పుడు మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌జ‌ల్లో క‌రోనా వైర‌స్ ప‌ట్ల భ‌యం ఉన్నప్పుడు వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అనే ఆస‌క్తి కూడా ఉండేది. ఇప్పుడు క‌రోనా అంటే భ‌య‌మూ త‌గ్గింది, వ్యాక్సిన్‌పైన ఆసక్తి త‌గ్గిపోయింది.

అలాగ‌ని దేశంలో క‌రోనా ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌పంచంలోనే క‌రోనా కేసులు ఎక్కువ ఉన్న దేశాల్లో భార‌త్ రెండో వ‌రుస‌లో ఉంది. అయితే, క‌రోనాకు భ‌య‌ప‌డి ఆగిపోవ‌డం కుద‌ర‌దు కాబ‌ట్టి ప్ర‌జ‌లు క‌రోనాతో క‌లిసి జీవించేందుకు సిద్ధ‌మ‌య్యారు. మాస్కులు, శానిటైజ‌ర్లు మ‌న జీవితాల్లో భాగ‌మైపోయాయి. అయితే, ఇది నెల, రెండు నెల‌ల‌కే ప‌రిమితం కాద‌ని నిపుణులు చెబుతున్నారు. క‌రోనా వైర‌స్ అనేది శాశ్వ‌తంగా మ‌న‌తోనే ఉండే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గాలంటే అయితే వ్యాక్సిన్ రావాలి లేదంటే ప్ర‌జ‌ల్లో క‌రోనాను ఎదుర్కొనే రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరిగి హెర్డ్ ఇమ్యూనిటీ రావాల‌ని వైద్య నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, వ్యాక్సిన్ వ‌చ్చినా, రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగినా క‌రోనా వైర‌స్ ఈ భూమి మీది నుంచి పూర్తిగా అంత‌రించి పోయే అవకాశాలు మాత్రం త‌క్కువే అని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇందుకు గానూ గ‌తంలో నుంచి మాన‌వాళిని వెంటాడుతున్న రోగాలు, వైర‌స్‌ల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు.

మ‌లేరియా వంటి రోగాల‌కు వ్యాక్సిన్‌లు వ‌చ్చినా ఇప్ప‌టికీ ఎక్క‌డో ఓ చోట మ‌లేరియా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. త‌ట్టు కూడా అక్క‌డ‌క్క‌డ వ‌స్తూనే ఉంది. ఇలా పాత రోగాల‌కు వ్యాక్సిన్‌లు ఉన్నా, వాటిని ఎదుర్కొనే రోగ నిరోధ‌క శ‌క్తి మ‌న‌లో ఉన్నా అవి ఎక్క‌డో ఓ చోట మాన‌వాళిపై దాడి చేస్తూనే ఉన్నాయి. ఇదే విధంగా క‌రోనా వైర‌స్ కూడా ఎప్ప‌టికీ మ‌న‌తోనే ఉండిపోవ‌చ్చు అని నెద‌ర్లాండ్స్‌లోని యుట్రెక్ట్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ ఈస్ట‌ర్‌బీక్ చెబుతున్నారు.

ప్ర‌జ‌ల్లో క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనే హెర్త్ ఇమ్యూనిటీ పెరిగినా, వ్యాక్సిన్ వ‌చ్చినా క‌రోనా పూర్తిగా అంతం కాద‌ని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అప్పుడ‌ప్పుడు క‌రోనా వైర‌స్ ఎక్క‌డో ఒక చోట‌, ఎక్కువ లేదా త‌క్కువ స్థాయిలో ప్ర‌భావం చూపించ‌వ‌చ్చ‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. అయితే, క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చినా, ప్ర‌జ‌ల్లో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగినా మంచిదేన‌ని, దీని వ‌ల్ల క‌రోనా కార‌ణంగా సంభ‌వించే మ‌ర‌ణాల సంఖ్య బాగా త‌గ్గిపోతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Related News