logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కోలుకుంటున్న వేళ కోయంబేడు దెబ్బ‌.. ఏపీలో పెరుగుతున్న క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి త‌గ్గుతుంద‌ని ఊర‌ట చెందుతున్న వేళ చెన్నైలోని కోయంబేడు మార్కెట్ దెబ్బ రాష్ట్రంపై ప‌డింది. దీంతో క‌రోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుతోంది. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 9,628 సాంపిల్స్‌ని పరీక్షించగా 48 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలారు. 101 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో నమోదైన మొత్తం 2205 పాజిటివ్ కేసులకు గాను 1353 మంది డిశ్చార్జ్ కాగా, 49 మంది మరణించారు. ప్రస్తుతం 803 మంది చికిత్స పొందుతున్నారు. గ‌త 24 గంట‌ల్లో న‌మోదైన మొత్తం 48 కేసుల్లో 31 కేసులు కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్న‌వే. క‌ర్నూలులో 9, నెల్లూరులో 9, గుంటూరులో 9, చిత్తూరులో 8, కృష్ణా జిల్లాలో 7, విశాఖ‌ప‌ట్నంలో 4, ప‌శ్చిమ గోదావ‌రిలో 1, క‌డ‌ప‌లో 1 పాజిటీవ్ కేసులు కొత్త‌గా న‌మోద‌య్యాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో అనంత‌పురంలో 122, చిత్తూరులో 173, తూర్పు గోదావ‌రిలో 52, గుంటూరులో 413, క‌డ‌ప‌లో 102, కృష్ణాలో 367, క‌ర్నూలులో 608, నెల్లూరులో 149, ప్ర‌కాశంలో 63, శ్రీకాకుళంలో 7, విశాఖ‌ప‌ట్నంలో 72, విజ‌య‌న‌గ‌రంలో 7, ప‌శ్చిమ గోదావ‌రిలో 70 కేసులు న‌మోద‌య్యాయి. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారు 150 మంది క‌రోనా పాజిటీవ్‌గా తేలింది.

Related News