logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

కరోనా బాధితుల్లో కొత్తగా మరో ‘మూడు’ లక్షణాలు..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటి దాటేసింది. కరోనా కట్టడికి విధించిన దేశగవ్యాప్త లాక్ డౌన్ కూడా ఈ వ్యాప్తిని ఆపలేకపోయింది. ఇకపోతే కరోనా వాక్సిన్ కూడా ఇంకా అందుబాటు లోకి రానందున ఇప్పుడు మన దగ్గరున్న ఏకైక ఆయుధం రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం. అలాగే కరోనా లక్షణాలను గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా చికిత్స కోసం సంప్రదించడం.

కొంత మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా పాజిటివ్ వస్తున్న సంగతి తెలిసిందే. మరి కొంత మందిలో కరోనా లక్షణాలు ఉన్నా వాటిని పసిగట్ట లేకపోవడం వల్ల పరిస్థితి విషమిస్తుంది. అయితే ఇప్పటివరకు మనకు తెలిసిన కరోనా లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటివి ఉన్నాయి.

తాజాగా అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన అధ్యయనంలో మరో మూడు కొత్త లక్షణాలు బయటపడ్డాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలే అని తేల్చారు. ఈ లక్షణాలు తీవ్రంగా ఉన్నట్టు అనిపిస్తే కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్దులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖా కూడా హెచ్చరిస్తుంది.

కరోనా లక్షణాలు:
జ్వరం
వణుకు
దగ్గు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
అలసట
ఒంటి నొప్పులు
తలనొప్పి
రుచి చూడలేకపోవటం, వాసన పసిగట్టలేకపోవటం
గొంతునొప్పి
ముక్కు దిబ్బడ
వాంతులు
డయేరియా

Related News