logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

మానవాళికి కొత్త సవాల్ విసురుతున్న కరోనా..!

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కరోనా నిబంధనలను పక్కన పెట్టేస్తున్నారు ప్రజలు. ఈ కారణంగానే యూరప్, అమెరికా వంటి దేశాల్లో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది.భారత్ కు కూడా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని, ఈ దశలో ప్రాణ నష్టం భారీగా ఉండవచ్చని అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా ప్రపంచానికి కొత్త సవాల్ ను విసురుతుంది. ఇప్పటి వరకు కరోనా అనేది మనుషుల నుంచి మనుషులకు మాత్రమే సోకుతుంది అనే విషయం తెలిసిందే.

కానీ తాజాగా డెన్మార్క్ లో ఈ వైరస్ మింక్ అనే జీవుల్లోకి ప్రవేశించినట్టుగా గుర్తించారు. ఈ వార్త పరిశోధకుల్లో ఆందోళనలు పెంచుతుంది. ఈ వార్త తెలియయడంతో డెన్మార్క్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. తమ దేశంలో ఉన్న 1. 7 కోట్ల మింక్ జీవుల్ని చంపేయాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇదొక ప్రమాదకార పరిణామంగా అభివర్ణిస్తున్నారు. అసలు ఆ దేశం మింక్ జీవులను ఎందుకు పెంచుతుంది? వీటికి కరోనా సోకడం వలన మానవాళికి ఉన్న ముప్పేమిటీ అనే విషయాలు తెలుసుకుంటే..

డెన్మార్క్ లో మింక్ జీవులను అధికంగా పెంచుతుంటారు. వీటి నుంచి ఉన్నిని తయారుచేస్తారు. వీటిని పెంచే కేంద్రం లో పని చేసే వారికి కరోనా సోకినట్టుగా గుర్తించారు. ముందు జాగ్రత్తగా మింక్ లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించడంతో వాటిలో కూడా కరోనా సోకిన ఆనవాళ్లను గుర్తించారు. అంతేకాదు ఈ వైరస్ వాటి నంచి తిరిగి మనుషులకు సోకుతుండటం ప్రమాదకరమని భావిస్తున్నారు. సార్స్ కోవ్ -2 కి చెందిన ఈ వైరస్ మింక్ జీవులకు సోకిన క్రమంలో ఉత్పరివర్తన చెంది తన రూపాన్ని మార్చుకుంటుంది.

అప్పుడు వాటి నుంచి మనుషులకు సోకితే తీవ్ర ప్రభావాలను చూపుతుంది. కరోనా అనేది ఆర్ఎన్ఏ వైరస్ కావడంవల్ల ఇది మార్పులకు లోనుకావడం సహజమే. ఇప్పటికే కరోనా డీ 614జీ గా మారిన విషయం తెలిసిందే. కానీ ఈ మార్పు ప్రస్తుత టీకాలపై ఎలాంటి ప్రభావం చూపదని రుజువైంది. కానీ మింక్ జీవుల నుంచి మనుషులకు సోకిన కరోనా వైరస్ లో స్పైక్ ప్రోటీన్ లో మార్పు జరుగుతుంది. మనుషుల కణాల్లోకి ప్రవేశించడానికి కరోనా ఉపయోగించుకునే ఈ ప్రోటీన్ ను ఆధారం చేసుకునే అధికభాగం కరోనా టీకాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటన్నది ఇప్పుడు శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్నగా మారింది.

Related News