logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

వుహాన్‌లో మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా వైర‌స్

క‌రోనా వైర‌స్ పుట్టిన చైనాలోని వుహాన్ న‌గ‌రంలో మ‌రోసారి వైర‌స్ వ్యాపిస్తోంది. గ‌త డిసెంబ‌ర్‌లో వుహాన్‌లోని ఓ స‌ముద్ర ఉత్ప‌త్తులు విక్ర‌యించే మార్కెట్‌లో కరోనా వైర‌స్ పుట్టింది. అక్క‌డి నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేగంగా వ్యాపించింది. ప్ర‌పంచ దేశాల‌న్నీ కరోనాతో స‌త‌మ‌త‌మ‌వుతున్నాయి. అయితే, వుహాన్‌లో మాత్రం క‌రోనా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టింది. దీంతో ఇక్క‌డ క‌ఠినంగా అమ‌లు చేసిన లాక్‌డౌన్‌ను నెల రోజుల క్రితం ఎత్తేశారు.

దీంతో వుహాన్‌లో సాధార‌ణ జీవ‌నం మొద‌లైంది. అయితే, ఇటీవ‌ల మ‌ళ్లీ వుహాన్‌లో ఒక‌టీ, రెండు క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ సంఖ్య నిన్న భారీగా పెరిగింది. ఈ న‌గ‌రంలో నిన్న ఒక్క‌రోజే 17 పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. అందులో బ‌య‌టి నుంచి న‌గ‌రానికి వ‌చ్చిన వారు ఏడుగురు ఉండ‌గా, మ‌రో 10 కేసులు వుహాన్‌లో ఉన్న వారివే. దీంతో వుహాన్‌లో మ‌రోసారి అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న వారికి ప‌రీక్ష‌లు జ‌రుపుతున్నారు. కాగా, చైనాలో ఇప్ప‌టి వ‌ర‌కు 82,918 క‌రోనా కేసులు న‌మోదు కాగా 4,633 మంది మ‌ర‌ణించారు.

Related News