logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఏపీపై కోయంబేడు దెబ్బ‌… భారీగా పెరుగుతున్న క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న సంద‌ర్భంలో చెన్నై కోయంబేడు మార్కెట్ దెబ్బ రాష్ట్రంపై ప‌డింది. దీంతో కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 68 కొత్త క‌రోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో నమోదైన మొత్తం 2100 పాజిటివ్ కేసులకు గాను 1192 మంది డిశ్చార్జ్ కాగా, 48 మంది మరణించారు. ప్రస్తుతం 860 మంది చికిత్స పొందుతున్నారు.

గ‌త 24 గంట‌ల్లో నెల్లూరు జిల్లాలో 15, చిత్తూరులో 9, క‌డ‌ప‌లో 2, కృష్ణా జిల్లాలో 2, శ్రీకాకుళంలో 2, ప‌శ్చిమ గోదావ‌రిలో 1 పాజిటీవ్ కేసు న‌మోదైంది. వీటిల్లో నెల్లూరు జిల్లాలో 12, చిత్తూరు జిల్లాలో 8, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని 1 కేసులు చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వ‌చ్చిన వారివి. అంటే గ‌త 24 గంట‌ల్లో న‌మోదైన మొత్తం 36 కేసుల్లో కోయంబేడుకు సంబంధించిన‌వే 21 కేసులు ఉన్నాయి. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారిలో 32 మంది క‌రోనా పాజిటీవ్‌గా తేలింది.

మొత్తంగా రాష్టంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌ర్నూలులో 591, గుంటూరులో 404, కృష్ణా జిల్లాలో 351, చిత్తూరులో 151, నెల్లూరులో 126, అనంత‌పురంలో 118, క‌డ‌ప‌లో 99, ప‌శ్చిమ గోదావ‌రిలో 69, విశాఖ‌ప‌ట్నంలో 66, ప్ర‌కాశంలో 63, తూర్పు గోదావ‌రిలో 51, శ్రీకాకుళంలో 7, విజ‌య‌న‌గ‌రంలో 4 కేసులు న‌మోద‌య్యాయి. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారిలో 105 మందికి క‌రోనా పాజిటీవ్‌గా తేలింది. ఒడిశా నుంచి వ‌చ్చిన వారికి 10 మందికి, మ‌హారాష్ట్ర నుంచి 67, గుజ‌రాత్ నుంచి 26, క‌ర్ణాట‌క నుంచి 1, ప‌శ్చిమ బెంగాల్ నుంచి 1 పాజిటీవ్ కేసులు వ‌చ్చాయి.

Related News