logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌తిపై క‌రోనా వైర‌స్‌ ఎఫెక్ట్‌..!

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం దేవుళ్ల‌పైనా ప‌డుతోంది. ఇప్ప‌టికే తిరుప‌తి స‌హా అన్ని దేవాల‌యాల్లో భ‌క్తుల ద‌ర్శ‌నానికి నో ఎంట్రీ బోర్డులు పెట్టేశారు. ప్ర‌తీ యేటా హైద‌రాబాద్‌లో అత్యంత ఘ‌నంగా జ‌రిగే ఖైర‌తాబాద్ వినాయ‌క ఉత్స‌వాల పైన కూడా క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ ప‌డింది. క‌రోనా కార‌ణంగా ప్ర‌తీ సంవ‌త్స‌రంలా భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌ను ఖైర‌తాబాద్ గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి విర‌మించుకుంది.

ఖైర‌తాబాద్‌లో సంవ‌త్స‌రానికి ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ వినాయ‌క విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చ‌వితికి నాలుగైదు నెల‌ల ముందు నుంచే ఈ విగ్ర‌హ త‌యారీ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంది. ఈ సంవ‌త్స‌రం 66 అడుగుల ఎత్తులో 18 త‌ల‌ల‌తో విశ్వ‌రూప వినాయ‌కుడిని ఏర్పాటు చేయాల‌ని ఉత్స‌వ స‌మితి నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఈ నెల 18వ తేదీన క‌ర్ర‌పూజ చేసి విగ్ర‌హ త‌యారీని ప్రారంభించాల‌ని భావించింది. కానీ, క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఇప్పుడు ఈ నిర్ణ‌యాన్ని మార్చుకుంది.

ప్ర‌తీ సంవ‌త్స‌రం చేసిన‌ట్లుగా భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌వ‌ద్ద‌ని ఉత్స‌వ సమితి నిర్ణ‌యించింది. 11 అడుగుల లోపే చిన్న విగ్ర‌హాన్ని మ‌ట్టితో త‌యారు చేసి ఖైర‌తాబాద్ వినాయ‌క మండ‌పం ప‌క్క‌నే ఉన్న గుడిలో ఏర్పాటు చేయాల‌ని ఉత్స‌వ క‌మిటీ ఒక నిర్ణ‌యం తీసుకుంది. వినాయ‌క చ‌వితి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పూర్తిగా త‌గ్గితే మ‌రికొంత ఎత్తైన విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు.

Related News