logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

సీజనల్ వ్యాధి లక్షణాలు – కరోనా లక్షణాలను ఎలా గుర్తించాలి ? కరోనా పరీక్షలు ఎవరికి అవసరం ?

భారత్ లో కరోనా రోజురోజుకి విస్తరిస్తుంది. మొదట కరోనాను అంతగా లెక్క చేయని ప్రజలు ఇప్పుడు ఈ మహమ్మారి పేరు వింటేనే వణికి పోతున్నారు. ఒకవైపు కరోనా వ్యాప్తి కలవరపెడుతుంటే మరోవైపు సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. అయితే ఈ రెండు కలగలసి ఇప్పుడు మరో కొత్త సమస్యను తెచ్చిపెడుతున్నాయి. కరోనా వైరస్ లక్షణాలు, సీజనల్ వ్యాధుల లక్షణాలు ఒకే విధంగా ఉండటంతో ఏది కరోనా? ఏది సీజనల్ వ్యాధి? అనే విషయం తెలుసుకోలేక సతమతమవుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో కొందరు కరోనా సోకినా సకాలంలో గుర్తించలేకపోతున్నారు. మరికొందరు సాధారణ జలుబు, జ్వరాన్ని కూడా కరోనా అనుకుని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న భారీ మార్పుల కారణంగా కొద్ది రోజులుగా నగరంలో సీజనల్ వ్యాధుల తీవ్రత పెరిగిపోయింది. దీంతో ప్రతి 10 మందిలో ఐదుగురు అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో వారంతా కరోనా పరీక్షల కోసం పరుగులు తీస్తున్నారు. మరోవైపు ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా భయంతో పరీక్షలు చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది.

దీంతో కరోనా టెస్టింగ్ సెంటర్ల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. అయితే పరీక్షా కేంద్రాలకు రావడం వల్ల కూడా కరోనా వైరస్ సోకె ప్రమాదం ఉందని, కేవలం కరోనా సోకిన వ్యక్తులతో కాంటాక్ట్ ఉన్న వారు, లక్షణాలు ఉన్న వారు మాత్రమే పరీక్షలకు రావాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఉన్నది సాధారణ జ్వరమా లేక కరోనానా అనే విషయం నిర్ధారించడం అంత సులువైన పని కాదని వైద్యులు చెబుతున్నారు. అయితే కొన్ని లక్షణాలను ముందుగానే గుర్తించినట్లయితే కరోనా నుంచి ప్రాణాపాయం లేకుండా బయటపడవచ్చని అంటున్నారు. అయితే వాటిని ఎలా నిర్ధారించుకోవాలి అనే విషయంపై వైద్య నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.

లక్షణాలు ఏవైనా ఎవరైనా కరోనా సోకిన వ్యక్తులను కలిస్తే వారికి ఈ వైరస్ సోకె అవకాశం అధికంగా ఉంది కాబట్టి వారి కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి అంటున్నారు. జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉంటె వారు తమ ఇళ్ల వద్ద ఉండే లక్షణాలను ముందుగా క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి. ఒక వేల సీజనల్ వ్యాధుల వంటి జలుబు, జ్వరం, దగ్గు ఉంటె మూడు రోజుల్లో ఆ వ్యక్తులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటారు. కఫముతో కూడిన దగ్గు ఉంటుంది. రుచి, వాసనా తెలుస్తుంది. తేలికపాటి ఒళ్ళు నొప్పులు ఉండటం సహజం. సాధారణమైన తలనొప్పి ఉండి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఇవన్నీ సీజనల్ వ్యాధుల ప్రభావమే. కానీ మూడు రోజులకు మించి ఈ లక్షణాలు తగ్గకుంటే వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలి.

గుండె, కిడ్నీ, క్యాన్సర్, హెచ్‌ఐవీ, బీపీ, షుగర్‌ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైరస్ ముప్పు అధికంగా ఉంటుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. కరోనా సోకిన వ్యక్తుల్లో ముందుగా జ్వరం, పొడి దగ్గు, గొంతునొప్పి, ఒళ్ళు నొప్పులు, రుచి వాసన కోల్పోవడం, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు ఉంటాయి. కళ్ళు ఎర్రబడటం, తీవ్రమైన తలనొప్పి, గొంతునొప్పి ఉంటుంది. ఛాతీలో నొప్పి కలుగుతుంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. వాంతులు, విరేచనాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కరోనా లక్షణాలు. వైరస్ లక్షణాలు కనిపించిన నాలుగు, ఐదు రోజుల్లో దగ్గు అధికంగా ఉండి ఆయాసం ఎక్కువైనట్టుగా గమనిస్తే వారు కచ్చితంగా ఆసుపత్రికి వెళ్లవలసి ఉంటుంది.

Related News