మోడెర్నా అభివృద్ధి చేసినా టీకాపై ఇప్పుడు ఓ షాకింగ్ వార్త బయటపడింది. అమెరికాను కరోనా వణికిస్తోంది. దీంతో ఇప్పటికే అక్కడ మోడెర్నా టీకా పంపిణీకి అమెరికా ఆమోదం తెలిపింది. వారం రోజులుగా అమెరికాలో టీకా పంపినికి సంబందించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వార్త అక్కడి ప్రజలకు కొంత ఊరటనిచ్చింది.
అయితే ఇంతలోనే ఈ టీకా సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమవుతుందని తెలిసి ఆందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఇటీవల అమెరికా లోని ఓ వైద్యుడు ఈ టీకాను తీసుకున్నారు. అయితే టీకా తీసుకున్న తర్వాత అతనిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయట. టీకా తీసుకున్న వెంటనే తనకు మైకం వచ్చినట్టుగా అనిపించిందని, గుండె వేగంగా కొట్టుకుందని వెల్లడించారు. అలాగే తనలో అలర్జీ లక్షణాలు ఉన్నాయన్నారు. అయితే ఈ వైద్యుడికి ఇది వరకే షెల్ఫిష్ అనే అలర్జీ ఉంది.
ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అతనికి వైద్యం అందించి అనారోగ్య సమస్యలకు గల కారణాలను అన్వేషించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చినట్టుగా వైద్యులు పేర్కొన్నారు. కాగా టీకా అందుబాటులోకి వచ్చిన వారం రోజులలోనే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ బయటపడటం గమనార్హం. ఇక ఇప్పటివరకు బయటపడిన సైడ్ ఎఫెక్ట్స్ లో ఇదే అత్యంత సీరియస్ కేసు అని బోస్టన్ మెడికల్ సెంటర్ ఒక ప్రకటనలో పేర్కొంది.