దేశీయంగా కరోనా వాక్సిన్ కు అనుమతులు రావాలంటే యూఏ ఆమోదం కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో యూకె , దేశాల్లో కరోనా వాక్సిన్ ట్రయల్స్, ఆమోదం లాంటి పరిణామాలను భారత్ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనికా – ఆక్స్ ఫర్డ్ టీకా ను తయారు చేస్తున్న సీరం కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే భారత్‌లో వాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది.
అయితే క్రిస్మస్ కు ముందే వాక్సిన్ ను అత్యవసరంగా ఉపయోగించేందుకు అనుమతి వస్తుందని భారత్ భావిస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రాజెనికా – ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ లను మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) పరిశీలిస్తుంది. వీటి ఫలితాలను, సామర్థ్యాన్ని, మోతాదును అంచనా వేస్తుంది.
ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే భారత్ లో వాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది. అందుకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో భారత్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాక్సిన్ పంపిణీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.