logo

  BREAKING NEWS

సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |  

ఏపీ ప్రజలకు శుభవార్త: కరోనా వాక్సిన్ పై ప్రభుత్వం సంచలన ప్రకటన!

కరోనా వాక్సిన్ ను దేశీయంగా పంపిణీ చేసేందుకు భారత ప్రభుత్వం సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు వాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరోనా వాక్సిన్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

వాక్సిన్ దేశంలో అడుగుపెట్టడానికి మరికొన్ని వారాల సమయం పడుతుందని అంతా భావిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మాత్రం వాక్సిన్ పంపిణీకి వడివడిగా అడుగులు వేస్తుంది. తాజాగా వాక్సిన్ తేదీని కూడా ప్రకటించేసింది. ”డిసెంబరు 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది. సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు 4762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుంది. కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించింది” అని ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

కాగా ప్రభుత్వం వాక్సిన్ పంపిణీ ప్రణాళిక కోసం 18 మందితో ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్ పర్సన్ గా రాష్ట్ర సీఎస్ నీలం సాహ్ని ఉండనున్నారు. ఇప్పుడు ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గతంలో రోజుకి వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పుడు రోజుకి 500 కరోనా కేసులు నమోదవుతున్నాయి.

 

 

 

Related News