తెలంగాణవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా కేసులపై తాజాగా వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం.. నిన్న ఒక్క రోజే 805 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కరోనా కేసులతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,69,223 కి చేరింది.
నిన్న ఒక్క రోజే కరోనాతో నలుగురు మరణించగా మొత్తం మరణాల సంఖ్య 1,455 కి చేరుకుంది. కరోనా బాధితుల్లో రికవరీ అవుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. శనివారం వరకు 948 కరోనా సోకిన వారు రికవరీ అయినట్టుగా ఆరోగ్య శాఖ బులెటిన్ లో ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,57, 278మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా గణాంకాల ప్రకారం.. నిన్న ఒక్క రోజే జీహెచ్ఎంసీ పరిధిలో 131, మేడ్చల్ జిల్లాలో 82, రంగారెడ్డి జిల్లాలో 58 కరోనా కేసులు వెలుగుచూశాయి. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 10490 ఉండగా వారిలో 8367 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నట్టుగా ఆరోగ్య శాఖ వెల్లడించింది.