logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

తెలంగాణ ప్రైవేటు ల్యాబుల్లో కరోనా పరీక్షలు.. ధరలు ఎంతంటే..?

రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు, చికిత్సలకు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా అనుమతులు ఇస్తున్నట్టుగా నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యంమత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చును ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ కొద్ది సేపటి క్రితం ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు చేయించుకుంటే రూ. 2,200 చెలించవలసి ఉంటుంది. కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యి వెంటిలేటర్ లేకుండా కేవలం ఐసీయూలో మాత్రమే చికిత్స అందిస్తే రూ. 7,500. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తే రోజుకి రూ. 9000 వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. పాజిటివ్ గా గుర్తించి..మామూలు ఐసోలేష‌న్ లో ఉంటే…రూ. 4వేలుగా తెలిపారు.

మంత్రి ఈటెల మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరలేదని ఐసిఎంఆర్ తెలిపిందన్నారు. రాష్ట్రంలో ఐసిఎంఆర్ మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తున్నామన్నారు. పైగా తెలంగాణలో కరోనాపై మనం తీసుకునే చర్యలు బాగున్నాయని ఐసిఎంఆర్ కితాబిచ్చిందన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేస్తున్నామని, లక్షణాలు లేని వారు కచ్చితంగా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని ఈటెల తెలిపారు.

Related News