logo

వాహనదారులకు కొత్త రకం షాక్.. ఇకపై కరోనా టాక్స్ కట్టాల్సిందే!

సామాన్య మధ్యతరగతి ప్రజలను కరోనా లాక్ డౌన్ కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఆరు రోజుల నుండి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల నెత్తిన మరో భారం మోపేందుకు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా టాక్స్ పేరుతో వాహనదారులకు కొత్త కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై అదనంగా కరోనా టాక్స్ కింద ఒక రూపాయిని వసూలు చేస్తున్నారు. ఈరోజు నుండే ఈ నిర్ణయం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో అమలులోకి వస్తున్నట్టుగా తెలిపారు. తాజాగా విధించే కరోనా టాక్స్ తో కలుపుకుని రాష్ట్రంలో పెట్రోల్ ధర లీటరు రూ. 82.64కు పెరిగింది. కాగా డీజిల్ ధర రూ. 73.14కు చేరుకుంది.

ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారు నిత్యావసరాలు కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా రవాణా సౌకర్యం లేక సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు పెట్రోల్ ధరపై అదనంగా వసూలు చేస్తుండటంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News