logo

  BREAKING NEWS

బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |   హైద‌రాబాద్ వ‌ర‌ద‌లు.. భారీగా విరాళాలు ప్ర‌క‌టించిన హీరోలు  |   ఫిబ్ర‌వ‌రి నాటికి స‌గం మందికి క‌రోనా వైర‌స్‌  |   రాబిన్ శ‌ర్మ‌తో చంద్ర‌బాబు ఒప్పందం..! ఆయ‌న ట్రాక్ రికార్డ్ తెలుసా..?  |   Breaking: వ‌ర‌ద బాధితుల‌కు భారీ సాయం ప్ర‌క‌టించిన కేసీఆర్‌  |   టీడీపీ క‌మిటీల నియామ‌కం.. లోకేష్‌, బాల‌య్య‌, సుహాసినికి కీల‌క ప‌ద‌వులు  |   బిగ్ బ్రేకింగ్‌: రెండు రాష్ట్రాల‌కు టీడీపీ అధ్య‌క్షుల నియామ‌కం  |   వ్యాక్సిన్ వ‌చ్చినా క‌రోనా ఇక ఎప్ప‌టికీ మ‌న‌తోనే ఉంటుంద‌ట‌  |   పాకిస్థాన్‌ వ‌ల్ల మ‌న పానీపూరీ రేట్లు పెరుగుతున్నాయి తెలుసా ?  |  

కరోనా ట్యాబ్లెట్లు వచ్చేసాయి.. ధర రూ. 59 రూపాయలే!

కరోనాకు ఇటివరకు నిర్దిష్టమైన చికిత్స, మందు లేదన్న విషయం తెలిసిందే. కరోనాకు చికిత్సను అందించడానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసెటమాల్, సిట్రిజన్ వంటి ఔషధాలను వాడుతున్నారు. అయితే ఇంకా వాక్సిన్ అందుబాటులోకి రాని నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో కరొనకు ‘కోవిఫర్’ పేరుతో గతంలో ఓ ఇంజక్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ. 5400 ఉండగా దీనిని కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్లో లో కూడా అమ్ముకున్నారు.

హెటిరో నుంచి తాజాగా మరో ఔషధం వచ్చింది. అయితే కోవిఫర్ తో పోలిస్తే దీని ఖరీదు కూడా చాలా తక్కువే కావడం విశేషం. హెటిరో ‘ఫావిపిరవిర్’ అనే యాంటీ వైరల్‌ డ్రగ్‌ ట్యాబెట్లను ‘ఫావివిర్’ పేరుతో ఈ రోజు మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్కో ట్యాబ్లేట్ ధర రూ. 59 గా నిర్ణయించింది. ఈ ట్యాబులెట్లను బుధవారం నుంచి అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ మెడికల్ దుకాణాల్లో, హాస్పిటల్స్‌లోని మందుల షాపుల్లో అందుబాటులో ఉంచనున్నట్టుగా సంస్థ తెలిపింది.

అయితే ఇవి కరోనా నుంచి పూర్తి స్థాయి ఉపశమనం కలిగించలేవు. డీసీజీఐ ఆమోదం పొందిన ఈ మందు కరోనాకు సంబందించిన తేలికపాటి లక్షణాలు ఉన్న రోగులకు ఈ మాత్రలను వాడి చికిత్స అందించవచ్చని వెల్లడించింది. కేవలం వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే వీటిని విక్రయిస్తారు.

Related News