logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

గాలిలో కరోనా.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతులు

కరోనా సోకిన వ్యక్తిని కలవలేదు, వారికి సన్నిహితంగా మెలగలేదు, ఇంట్లోనే ఉన్నాం అయినా నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇది చాలా మంది కరోనా రోగులు చెప్పే మాట. వీరికి కరోనా ఎలా వచ్చిందనే విషయాన్ని కచ్చితంగా నిర్దారించలేకపోతున్నారు అధికారులు. కరోనాపై చేపట్టిన తాజా పరిశోధన ఇందుకు సంబందించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకు నోరు, ముక్కు నుంచి వెలువడే తుంపర్ల ద్వారా మాత్రమే కరోనా వ్యాపిస్తుందని అంతా భావించారు. కానీ తాజాగా గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని వెల్లడైంది.

అమెరికా, యూకె, కెనడా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంతలా విజృంభించడానికి ఇదే కారణమనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కరోనా సోకిన వ్యక్తిని తాకకున్నా, సన్నిహితంగా మెలగకపోయినా కరోనా బారిన పడుతున్న సంఘటనలే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.

కరోనా రోగి డ్రాప్ లెట్స్, అతను వాడిన వస్తువుల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తున్నా .. గాలి ద్వారానే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ఇందుకు సంబందించిన కొత్త మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది. అయితే గాలిలో కరోనా 3 గంటల పాటు జీవించి ఉంటుందని వెల్లడైంది. కాబట్టి గాలి ద్వారా వ్యాపించే వైరస్ బారిన పడకుండా పాటించవలసిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కరోనా వైరస్ బహిరంగ ప్రదేశాల్లో కన్నా ఇల్లు, ఆఫీసుల లాంటి ప్రదేశాల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే వెంటిలేషన్ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకూడదు. కరోనా రోగి ఉన్న ప్రదేశాల్లో కొంత మందికి ఈ వైరస్ సోకలేదు అందుకు కారణం వారున్న ప్రదేశాల్లో గాలి, వెలుతురు అధికంగా ఉండటమే. అంటే ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా మనం ఉంటున్న ప్రదేశంలో గాలి, వెలుతురు ధారాళంగా ఉండేట్లు చూసుకోవాలి. వైరస్ ఉన్నా, లేకపోయినా ఇతరులతో సన్నిహితంగా మెలగకూడదు. 5 నిమిషాల కన్నా ఎక్కువ సేపు దగ్గరగా ఉండి మాట్లాడకూడదు.

ఒకవేళ ఎవరైనా వైరస్ బబారిన పడితే వారు కచ్చితంగా ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉండాలి. రోగితో పాటుగా వారి కుటుంబ సభ్యులు నాణ్యమైన మాస్కులను వేసుకోవాలి. ఒక వేళ కరోనా సోకిన వ్యక్తి బయటకు రావలసి వస్తే కూడా మాస్కు తప్పనిసరి. తుమ్ము,దగ్గు వచ్చినప్పుడు ఏదైనా వస్త్రంతో లేదా మాస్కుతో కవర్ చేయాలి. లేదా చేతిని అడ్డు పెట్టుకోవాలి. చేతిపై ఉండే వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందు కాబట్టి 20 నిమిషాల పాటు చేతులను హ్యాండ్ వాష్ తో కడగాలి.

Related News