logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

కరోనా సెకండ్ వేవ్ వివిధ దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికాలో ఈ ప్రభావంతో రోజుకి లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కూడా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కరోనా వణికిస్తోంది.

దీంతో పలు చోట్ల మళ్ళీ లాక్ డౌన్ విధించే దిశగా రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. దానికితోడు చలి కాలంలో కరోనా విజృంభిస్తుందని పరిశోధకులు హెచ్చరించడంతో తెరుచుకున్న పాఠశాలలు మళ్ళీ మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్రానికి కూడా కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సెకండ్ వేవ్ లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే విధంగా వైద్య ఆరోగ్య శాఖను సంసిద్ధం చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కరోనా సెకండ్ వేవ్ లో తీసుకొవలసిన జాగత్తలపై చర్చించారు. కాగా అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యాలు కలిగించాలని నిర్ణయించారు. అందుబాటులో 22 వేల పడకలు ఉండగా వాటిలో కేవలం 11 వేల బెడ్లకు మాత్రమే ఆక్సిజన్ సౌకర్యం ఉంది. దీంతో ఈ సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Related News