logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

రాష్ట్రానికి పొంచి ఉన్న మరో ముప్పు.. కేంద్రం కొత్త మార్గదర్శలు ఇవే!

యూరప్, అమెరికా వంటి దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న నేపథ్యంలో భారత్ కు కూడా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 2.42 లక్షలకు చేరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన జిల్లాలపైన ఫోకస్ పెట్టారు. తాజాగా రాష్ట్రానికి కూడా సెకండ్ వేవ్ ప్రమాదం ఉన్నట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఇప్పటికే కేంద్రం తాజా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

కేంద్రం తెలిపిన మార్గదర్శకాల ప్రకారం.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదను. పిల్లలు, వృద్దులు ఇంట్లోనే ఉండాలి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పండగలు శుభకార్యాల్లో అందరు ఒకే చోట గుమిగూడవద్దు. చలికాలంలో డెంగ్యూ, మలేరియా, ఫ్లూ జ్వరాలతో పాటుగా కరోనా కూడా సోకే ప్రమాదం ఉంది.

కరోనా అలక్షణాలు ఉన్నట్టుగా నౌమానిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుని ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండాలి. ఇంట్లోవారితో కనీసం 2 మీటర్ల దూరాన్ని పాటించాలి. ఐసోలేషన్ గదిలో తగినంత గాలి, వెలుతురూ వచ్చేలా చూసుకోవాలి. తరచుగా జ్వరం చెక్ చేసుకోవాలి, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి.

పండ్లు, కూరగాయలను బేకింగ్ పౌడర్ కలిపిన నీటితో శుభ్రం చేసుకోవాలి. బయట వండిన ఆహార పదార్థాలను తినకూడదు. ఇంట్లో వండిన వాటినే తినాలి. పాలలో పసుపు కలిపి తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే నిమ్మరసం, కొబ్బరినీళ్లు వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తాగాలి.

Related News