logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

చలికాలంలో కరోనా ప్రమాదమెంత?.. శుభవార్త చెప్పిన తాజా పరిశోధన!

ఈసారి చలికాలం ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు పెంచుతుంది. వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, చలి కారణంగా కరోనా వైరస్ మరింత ఉధృత రూపం వేగంగా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే చలి కాలంలో కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవలసి వస్తుందని వైరస్ ఇంతకన్నా ప్రమాదకారి కావచ్చని శాస్త్రవేత్తలు, వైద్యులు భావిస్తున్నారు. ఈ కారణంగా ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.

కానీ చలికాలం అయినంత మాత్రాన వైరస్ విస్తరిస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. వైరస్ ను వ్యాపింపజేసేది మనలో ఉన్న అజాగ్రత్తే తప్ప వాతావరణానికి వైరస్ వ్యాప్తికి సంబంధం లేదని ఈ పరిశోధన పేర్కొంటుంది. జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరగడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటి చిన్న తప్పులే పెను ప్రమాదాన్ని తెచ్చిపెడతాయని వాతావరణంలో వచ్చే మార్పులు ఇందుకు చాలా తక్కువ కారణమవుతాయని ఈ పరిశోధన తేల్చి చెబుతుంది.

అస్లీనోని యూనివర్సిటీ టెక్సాస్ పరిశోధకులు వాతావరణం మార్పులు, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు కరోనా వ్యాప్తిని ఏమేరకు ప్రభావితం చేస్తాయనే అంశంపై పరిశోధనలు జరిపిన అనంతరం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ పరిశోధన ఆధారంగా కరోనా వైరస్ నిర్లక్ష్యం కారణంగానే ఇతరులకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. వేసవి కాలంలో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది అని నిర్దారించారు. అయితే ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గులు వైరస్ వ్యాపించడానికి ఏమాత్రం కారణం కావని తెలిపారు.

మనుషుల నిర్లక్ష్య ధోరణి, జీవన శైలి కారణంగానే వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టుగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కరోనా వ్యాపించడంలో వాతావరణం మార్పులు చాలా తక్కువ ప్రభావం చూపుతాయన్నారు. అమెరికాలో ఈ ఏడాది మార్చి నెలలో జరిపిన పరిశోధనల ప్రకారం ఇంట్లో కంటే బహిరంగ ప్రదేశాల్లోనే కరోనా వ్యాప్తి 34 నుంచి 26 శాతం అధికంగా ఉంటుందని అలాగే జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి 23 నుంచి 13 శాతంగా ఉన్నట్టుగా తేలింది. అంటే మనుషుల ప్రవర్తనల ఆధారంగానే వైరస్ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని వాతావరణ మార్పుల వల్ల కాదని వారు గుర్తించారు.

Related News