బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండవసారి కరోనా బారిన పడ్డారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ప్రధాని పార్లమెంటు సభ్యుల బృందంలోని ఓ ఎంపీని కలిశారు. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో అధికారులు జాగ్రత్త పడ్డారు. ప్రధానికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా మరోసారి ఆయనకు కరోనా సోకినట్టుగా తాలింది.
దీంతో ఆయన పది రోజులపాటు క్వారెంటైన్ లో ఉండనున్నారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు లేకపోయినా పాజివ్ గా తేలింది కాబట్టి ఇంటి నుంచే బోరిస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు. కాగా గతంలో ఓసారి బోరిస్ జాన్సన్ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.
అప్పుడు అయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉండి చికిత్స పొందారు. ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకుని తిరిగి తన విధులకు హాజరవుతున్నారు. ఇంతలోనే గురువారం నాడు ఎంపీ లీ అండర్సన్ ఓ సమావేశంలో కలుసుకున్నారు. ఆ ఎంపీకి కరోనా పాజిటివ్ గా తేలడంతో ప్రధాని అప్రమత్తమయ్యారు.