logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కరోనాను జయించాడు.. ఆసుపత్రి బిల్లు మాత్రం 8.5 కోట్లు!

కరోనా సోకి చావు అంచుల దాకా వెళ్లిన రోగిని వైద్యులు కాపాడారు. దీంతో రోగి కుటుంబ సభ్యులతో సహా అతనికి సేవలు అందించిన వైద్య సిబ్బంది కూడా సంతోషం వ్యక్తం చేసారు. ఇక డిస్ ఛార్జ్ అయ్యే సమయానికి ఆసుపత్రి బిల్లు చూస్తే అప్పటివరకు వారి మొహం లో ఉన్న వెలుగు ఒక్కసారిగా చిన్నబోయింది. కారణం ఆ వ్యక్తి ఆసుపత్రి బిల్లు ఏకంగా 8. కోట్లు. ఎంత ధనవంతులైనా ఈ బిల్లు చూస్తే ఖంగుతినాల్సిందే.

అమెరికాలోని సియాటెల్ నగరానికి చెందిన 70 ఏళ్ల వృద్ద్దుడికి కరోనా సోకడంతో మార్చి నెలలో ఆసుపత్రిలో చేరాడు. అప్పటికే ఆరోగ్యం క్షిణించడంతో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. అయినా ఏమాత్రం లాభం లేకపోవడంతో బందువులకు కబురు పేట్టుకోవచ్చని వైద్యులు తేల్చేశారు. భార్య పిల్లలను కూడా కలిసే అవకాశం లేకపోవడంతో ఫోన్ లోనే వారితో ఆఖరి మాటలు మాట్లాడాడు.

కానీ ఊహించని విధంగా 62 రోజుల తర్వాత మొదటిసారి ఆ వ్యక్తి వైద్యానికి స్పందించడంతో కరోనాను జయించాడు. కానీ బిల్లు మాత్రం కోట్లలో రావడంతో షాకయ్యారు. అయితే ఆ బిల్లును వారు కట్టాల్సిన పని లేదని అతడికి భీమా సదుపాయం ఉండటంతో ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. కానీ పన్నులు కట్టే వారి డబ్బు నుంచి అంత సొమ్మును తన ఆరోగ్యం కోసం వినియోగించుకోవడం తనకు బాధ కలిగించిందని అతను తెలపడం గమనార్హం.

Related News