logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కరోనా నుంచి కోలుకున్న వారికి షాక్.. 90 శాతం మందిలో కొత్త సమస్య!

కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్లో ఊపిరితిత్తలు, ఇతర శరీర భాగాలని కరోనా ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై శాస్త్రవేత్తలు పరోశోధనలు జరుపుతున్నారు. అధిక రక్తపోటు, ఊపిరితిత్తులు, గుండె సంబంధ సమస్యలు, డయాబెటిస్‌తో బాధపడుతున్న సీనియర్ సిటిజన్లకు వైరస్ సోకితే తీవ్రత ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ రోగుల శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఊపిరితిత్తుల దిగువన ఉన్న భాగంలో వైరస్ చేరుతుంది.

ఊపిరితిత్తుల్లో ఈ వైరస్ న్యుమోనియాను కలుగజేస్తుంది. దీంతో రక్త ప్రసరణకు అవసరమైన ఆక్సిజన్ అందక కార్బన్ డైయాక్సిడ్ శాతం పెరిగిపోవడంతో మరణానికి దారి తీస్తుంది. కానీ కొంత మందిలో మందిలో వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంది ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కానీ తాజా పరిశోధన మాత్రం షాకింగ్ విషయాన్ని వెల్లడిస్తుంది. క

రోనా నుంచి కోలుకున్న వారు ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కుంటున్నారని తెలిపింది. చైనా లోని వుహాన్ ఆసుపత్రిలో కరోనా సోకి కోలుకున్న వారిపై జరిపిన అధ్యయనాల్లో 90 శాతం మందికి ఊపిరి తిత్తులు సక్రమంగా పని చేయడం లేదని ఈ అధ్యయనం తెలిపింది. అలాగే 5 శాతం మంది తిరిగి క్వారెంటైన్ కు వెళ్ళవలసి వచ్చిందని పేర్కొంది. వుహాన్ యూనివర్సిటీకి చెందిన జాంగ్ హాన్ ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం ఈ అధ్యయనం చేపట్టింది. ఆరోగ్యవంతులు లాగా వీరిలో ఊపిరితిత్తుల పని తీరు సక్రమంగా లేదని తెలిపింది.

సాధారణంగా ఒక ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి 6 నిమిషాల్లో 500 మీటర్లు నడవగలిగితే కరోనా సోకి కోలుకున్న వ్యక్తి కేవలం 400 మీటర్లు మాత్రమే నడవగలుగుతున్నారని అలాగే వీరిలో బీ కణాల స్థాయి కూడా తక్కువగా ఉండటం గుర్తించామన్నారు. అంటే రోగ నిరోధక వ్యవస్థ ఇంకా కుదుటపడలేదని అంటున్నారు.

వీరిలో సాధారణంగా జరగవలసిన వాయు ప్రక్రియ, గ్యాస్ ఎక్స్ ఛేంజ్ వంటివి సక్రమంగా జరగడం లేదన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారిలో కొందరు మూడు నెలల పాటు ఆక్సిజన్ యంత్రాలపైనే ఉండవలసి వచ్చిందన్నారు. 10 శాతం మందిలో యాంటీ బాడీల ఉనికే లేదన్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా కుటుంబ సభ్యులే దూరం పెట్టడం వంటివి వారినింకా కుంగదీస్తున్నాయని అన్నారు.

Related News