logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

ఏపీలో కరోనా కేసుల రికార్డు.. మొత్తం కేసులు ఎన్నంటే?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తుంది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 50 వేలు దాటిన కరోనా కేసులు తాజాగా నమోదైన కేసులతో 60 వేలకు చేరువలో ఉన్నాయి. ఇక తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 4944 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం నమోదైన కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఇందులో 32,336 కేసులు యాక్టివ్ గా ఉంటె, 25,574 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఏపీలో 62 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య758కి చేరింది.

రాష్ట్రంలోని జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:
అనంతపూర్ లో 458, చిత్తూరులో 560, తూర్పు గోదావరి 524, గుంటూరు 577, కడప 322, కృష్ణా 424, కర్నూలు 515, నెల్లూరు 197, ప్రకాశం 171, శ్రీకాకుళం 133, విశాఖపట్నం 230, విజయనగరం 210, పశ్చిమ గోదావరిలో 623 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అప్రమత్తమైం ప్రభుత్వం కేసులు అధికంగా ఉన్న తిరుపతి వంటి ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించింది. నెల్లూరు జిల్లాలో కూడా లాక్ డౌన్ విధించే ఆలోచనలో ఉన్నామని ఇటీవల మంత్రి అనిల్ స్పష్టం చేసారు.

Related News