logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

బ్రేకింగ్: హీరో చిరంజీవికి కరోనా.. వారంతా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి!

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభించనున్న సందర్భంగా తాను కూడా కరోనా టెస్టు చేయించుకున్నానని అందులో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలిపారు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. ప్రస్తుతం తాను హోమ్ క్వారెంటైన్ లో ఉంటునట్టుగా తెలిపారు.

గత నాలుగైదు రోజులుగా తనను కలిసినవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని అభిమానులతో పంచుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కాగా చిరంజీవి ఇటీవలే హీరో నాగార్జునతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. నిన్ననే హీరో రామ్ చరణ్, ఎంపీ సంతోష్ తో కలిసి మొక్కలు నాటారు.

కాగా ఇప్పుడు వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభం కావలసిన ఆచార్య సినిమా షూటింగ్ మళ్ళీ వాయిదా పడింది.

Related News