logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్..!

హైదరాబాద్ లో కరోనా కలకలం రేపుతున్న సమయంలో తాజాగా అందిన వార్త నగరవాసుల్లో గుబులు పుట్టిస్తుంది. లాక్ డౌన్ సడలింపులు ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నగరంలోని కింగ్ కోటి లో గోకుల్ చాట్ యజమానికి కూడా కరోనా సోకింది.

దీంతో గోకుల్ చాట్ యజమాని విజయ్ వైరాగ్యి(70) ని ఆసుపత్రికి తరలించి షాపులో పనిచేస్తున్న 20 మందిని క్వారెంటైన్ కు తరలించారు. ఇటీవల యజమాని అనారోగ్యం భారిన పడటంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. గత రెండు మూడు రోజులుగా వందలాది మంది ఇక్కడకు చాట్ కోసం వచ్చినట్టు తేలింది. ఇప్పుడు వారందరిని కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు.

మరోవైపు తెలంగాణలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుందది. రాష్ట్రంలో ఒక్క రోజే కొత్తగా 219 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5193కి చేరింది. ఈ నెలలోనే రెండు వేలకు పైగా కేసులు నమోదవడం, అందులో హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు నమోదవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

Related News