logo

  BREAKING NEWS

మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల!  |  

ఇద్ద‌రు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీలకు క‌రోనా పాజిటీవ్‌

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఇద్ద‌రు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన లోక్‌స‌భ స‌భ్యులు క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డారు. పార్ల‌మెంటు స‌మావేశాలు ఇవాళ‌టి నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. స‌మావేశాల‌కు ముందు ఎంపీలు అంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని నిబంధ‌న పెట్టారు. దీంతో అంద‌రూ ఎంపీలు ప‌రీక్ష‌లు చేయించుకున్నారు.

ఈ ప‌రీక్ష‌ల్లో అర‌కు ఎంపీ గొడ్డెటి మాధ‌వి, చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌కు క‌రోనా పాజిటీవ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. మాధ‌వి స్వ‌ల్ప జ్వ‌రంతో బాధప‌డుతున్నారు. మ‌రో ఎంపీ రెడ్డ‌ప్ప‌కు ఎటువంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేక‌పోయినా కరోనా పాజిటీవ్ వ‌చ్చింది. దీంతో ఇద్ద‌రు ఎంపీలు చికిత్స పొందుతున్నారు. వీరు పార్ల‌మెంటు స‌మావేశాల‌కు హాజ‌రుకారు. క‌రోనా బారిన ప‌డిన ఇద్ద‌రు ఎంపీలూ వైసీపీకి చెందిన వారే.

Related News