logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

సీఎం జగన్ నివాసం చుట్టూ కరోనా పాజిటివ్ కేసులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసం చుట్టూ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాడేపల్లి గూడెం లోని జగన్ నివాసానికి అతి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ కట్ట, క్రిస్టియన్ పేట లో గురువారం 4 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లే దారి కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చుట్టు పక్కల ప్రాంతాల్ని అధీనంలోకి తీసుకుని ప్రజలు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

సీఎం నివాస ప్రాంతం కావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. నేడు ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా పరిగణించి చర్యలు తీసుకోనున్నారు. కరోనా సోకిన నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు గ్రామ వాలంటీర్లుగా సమాచారం. ప్రస్తుతం చుట్టుపక్కల ప్రాంతాల్ని శానిటైజ్ చేస్తున్నారు. సీఎం నివాసముండే ప్రాంతం లోనే కరోనా కేసులు వెలుగు చూస్తుండటంతో స్థానికంగా ప్రజలు హడలిపోతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా 9986 టెస్టులు నిర్వహించగా వారిలో 98 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 3377 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 2277మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 1033గా ఉన్నాయి. ఇక కరోనాతో మరణించినవారి సంఖ్య 71కు చేరుకుంది. .

Related News