logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఏపీలో కరోనాతో మరో 11 మంది మృతి.. భారీగా పాజిటివ్ కేసులు!

ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 796 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. తాజా మరణాలతో ఏపీలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 157కు చేరింది.

24,458 మంది శాంపిల్స్ ను పరీక్షించగా 796 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో 51 మంది ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చినవారిగా గుర్తించారు. కాగా మరో ఐదుగురు విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. ఏపీలో తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12,285 గా ఉంది. ఇప్పటివరకు 5,480 మంది డిశ్చార్జి కాగా, 6,648 మంది చికిత్స పొందుతున్నారు.

Related News