logo

ఉస్మానియాలో కరోనా కలకలం.. 12 మంది విద్యార్థులకు పాజిటివ్

తెలంగాణ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుంది. తాజాగా హైద్రాబాద్ లోని ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. రాష్ట్రం మొత్తం మీద హైద్రాబాద్ లోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ముందు జాగ్రత్తగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్న 296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

వీరిలో 12 మంది వైద్య విద్యార్థులు కరోనా భారీగా పడ్డట్టుగా కలశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ వెల్లడించారు. మిగిలిన వారి ఫలితాలు త్వరలోనే వచ్చే అవకాశం ఉందన్నారు. లాక్ డౌన్ కారణంగా 180 మంది విద్యార్థినులు 116 విద్యార్థులు హాస్టల్ లో వుండి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే 5 రోజుల క్రితం ఓయూ వైద్య విద్యార్థికి కరోనా సోకినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని డీఎంఈ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ కొట్టిపారేశారు. ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.

Related News