బ్రిటన్ లో కొత్తరకం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇప్పటివరకు మన రాష్ట్రానికి 1200 మంది యూకే నుంచి వచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు. వీరందరికి ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అమలుచేస్తున్నారు.
కాగా ఇప్పుడు తెలంగాణవాసుల్లో కొత్త కరోనా టెన్షన్ మొదలైంది. ఈ వైరస్ గతంలో కన్నా 70 శాతం అధికంగా విస్తరిస్తోందన్న విషయం తెలిసిందే. ఈ కొత్త వైరస్ పై ఇప్పటికే పరిధోధకులు లోతైన అధ్యనాలు జరుపుతున్నారు. జన్యుమార్పిడి చెందిన కొత్తరకం కరోనా ‘VUI 202012/01’ స్పైక్ ప్రొటీన్ శరీరంలోని కణజాలానికి సులభంగా అంటుకుని వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధకులు పేర్కొంటున్నారు.
ఇందులో భాగంగా ఈ వైరస్ కు సంబందించిన లక్షణాలు వెల్లడించారు. కొత్త కరోనా సోకినవారిలో సాధారణంగా ఉండే పొడి దగ్గు, జ్వరం, వాసనా కోల్పోడంతో పాటుగా తీవ్రమైన అలసట ఉండటం, కండరాల నొప్పి, మానసిక గందరగోళం ఏర్పడతాయాయి. వాటితో పాటుగా విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించడం కూడా ఒకటని వైద్యులు వెల్లడిస్తున్నారు.