బ్రిటన్ ను గడగడలాడిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. యూకే నుంచి భారత్ కు వచ్చిన వారిపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే భారత్ యూకే నుంచి వచ్చే విమాన రాకపోకలపై నిషేధం విధించింది కేంద్రం.
ఇక అక్కడి నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా టెస్టులు జరిపించి వారిని క్వారెంటైన్ లో ఉంచింది. వారితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా క్వారెంటైన్ కు తరలిస్తున్నారు అధికారులు. అయినా భారత్ లో ఈ కరోనా కొత్త స్ట్రెయిన్ అడుగుపెట్టడం కలకలం రేపుతోంది. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ గా తేలడంతో వారందరిని ఐసొలేట్ చేసింది.
కాగా పరీక్షలు జరిపిన కొందరిలో కరోనా కొత్త స్ట్రెయిన్ ను ఆయా రాష్ట్రాలు గుర్తించాయి. అయితే ఆ వివరాలు మొన్ననే వచ్చినా వాటిని గోప్యంగా ఉంచి తాజాగా కేంద్రానికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినా వారి వివరాలను పంపించాయి. ఇక కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం భారత్ ల్లో మొత్తం ఆరుగురికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకింది.
వారిలో బెంగుళూరులో మూడు, హైద్రాబాద్లో రెండు, పుణేలో ఒక కేసు నమోదైనట్టుగా వెల్లడించారు. కాగా యూకే నుంచి వచ్చిన ప్రయాణికులలో మరికొంత మంది మిస్సయినట్టుగా సమాచారం అందుకున్న అధికారులు ఇప్పుడు వారిని కనిపెట్టి క్వారెంటైన్ కు తరలించే ప్రక్రియను మొదలుపెట్టారు.