logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

షాకింగ్: మెగాస్టార్ చిరంజీవికి కరోనా రాలేదు.. అంతా ఉత్తిదే!

నాలుగు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడినట్టుగా గుర్తించారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసారు. దీంతో ఆయన అభిమానులంతా చిరంజీవి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా చిరంజీవి మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. తనకు కరోనా లేదని తెలిపారు.

ఆచార్య షూటింగ్ సమయంలో కరోనా పరీక్షలు జరుపగా తనకు కరోనా పాజిటివ్ గా తేలిందన్నారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని పూర్తి ఆరోగ్యంగా ఉన్నానన్నారు. దీంతో అనుమానం కలిగి తాను మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోగా అన్నిటిలో తనకు నెగిటివ్ వచ్చిందన్నారు.

సీటీ స్కాన్ లోనూ, ఆర్ టీ పీసీఆర్ టెస్టులోనూ చివరకు తాను ముందుగా ఉపయోగించిన టెస్టు కిట్లతో కూడా పరీక్షించుకోగా తనకు నెగిటివ్ అనే చూపిందన్నారు. ఫాల్స్ కిట్ కారణంగానే తనకు కరోనా తప్పుడు రిపోర్ట్ వచ్చిందన్నారు. అటు కరోనా ఇటు కాలం తనతో ఆడేసుకుంటున్నాయని చిరంజీవి వ్యాఖ్యానించారు. తనకోసం పూజలు, ప్రార్థనలు చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related News