logo

  BREAKING NEWS

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |   బ్రేకింగ్‌: రైతుల కోసం జ‌గ‌న్ మ‌రో అద్భుత‌మైన ప‌థ‌కం  |   సోష‌ల్ మీడియాలో క‌నిపించే ఈ ఆఫ్రిక‌న్ బుడ్డోడి అస‌లు క‌థ ఇది  |   కరోనా రికార్డు.. 24 గంటల్లో 20,903 కేసులు.. 18 వేల మరణాలు!  |   లఢక్ కు చేరుకున్న ప్రధాని మోడీ.. దేనికి సంకేతం?  |   తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..!  |  

భారత్ లో కరోనా అంతం అప్పుడే.. !

భారత్ లో కరోనా వ్యాప్తి ఈ ఏడాదిలో పూర్తిగా తగ్గుముఖం పడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ప్రజారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 1వ తేదీ నుంచి మే 19 మధ్య కాలంలో దేశంలో కరోనా కేసుల గణాంకాలను ప్రసిద్ధ బైలీ మాథెమటికల్ మోడల్ లో విశ్లేషించిన అనంతరం ఈ విషయం తేలిందన్నారు. వైరస్ సోకిన వారి సంఖ్య కు కోలుకున్న వారి సంఖ్య సమానమైతే వైరస్ పూర్తిగా తొలగిపోయినట్టే అన్నారు.

దేశంలో కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందనే విషయం కచ్చితంగా చెప్పలేకపోయినా ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా కరోనా తీవ్రత తగ్గవచ్చని వైద్య కుటుంబ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ కు చెందిన పబ్లిక్ హెల్త్ డిప్యూటీ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ‘ఎపిడెమియాలజి ఇంటర్నేషనల్’ జనరల్ లో ఆయన రాసిన వ్యాసంలో ఈ విధంగా వెల్లడించారు. కుష్టు వ్యాధి డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ హెల్త్ కు చెందిన డాక్టర్ రూపాలీ రాయ్ తో కలిసి ఆయన ఈ అధ్యయనం చేసారు.

దేశంలో లాక్ డౌన్ మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. కానీ ఆయా రాష్ట్రాల్లో దాన్ని ప్రభావవంతంగా అమలు చేయలేకపోయారన్నారు. ఇది కూడా దేశంలో కరోనా కేసులు పెరగడానికి ఒక కారణంగా ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న రోజులో ఎంత మంది ప్రజలు కరోనా భారిన పెడతారనే విషయం తేల్చి చెప్పలేమని ఆయా భౌతిక దూరం, ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న తీరుపై అది ఆధారపడి ఉందన్నారు. అయితే కరోనాను పూర్తిగా నివారించడం సాధ్యతరమైన విషయమే అని తెలిపారు.

Related News