logo

  BREAKING NEWS

RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |  

చికెన్ లో కరోనా.. చైనా వింత వాదన.. మండిపడుతున్న ప్రపంచ దేశాలు!

కరోనా దెబ్బకు ప్రతి ఒక్కరు వణికిపోతున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తిని మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. దీంతో ప్రజలంతా ఇంట్లోనే ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. అందుకోసం ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పోషకాలు అధికంగా లభించే చికెన్ ను వినియోగిస్తున్నారు. కరోనా వ్యాపించిన తొలి రోజుల్లో చికెన్ తింటే కరోనా వస్తుందనే ప్రచారం మొదలైంది. ఈ దుష్ప్రచారంతో ధరలు తగ్గి చికెన్ వినియోగం పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా చితికిపోయారు.

దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం వైరస్‌ ద్వారా వ్యాపించే వ్యాధులతో పోరాడాలంటే ప్రజల్లో రోగనిరోధక శక్తి ఎంతో అవసరమని, చికెన్ తినడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ప్రచారం చేసింది. దీంతో చికెన్ అమ్మకాలతో పాటు ధరలు కూడా ఊపందుకున్నాయి. కాగా ఇప్పుడు చికెన్ లో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించాయనే వార్తలు అలజడి రేపుతున్నాయి. ఈ వార్తలతో ప్రజల్లో కొత్త టెన్షన్ మొదలైంది.

చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్ ఆనవాళ్లను అన్వేషించే పనిలో పడింది. ఈ నేపథ్యంలో కరోనాకు పుట్టినిల్లయిన చైనాలోనే తాజా విషయం వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్, ఈక్వెడార్ నుంచి మాంసం, చేపలు, ఎండ్రికాయలను చైనా భారీగా దిగుమతి చేసుకుంటుంది. కాగా కరోనా వైరస్ చైనాలోని వుహాన్ మార్కెట్లో నుంచి వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ నెల నుంచి చైనా ఈ దిగుమతులను నిలిపివేసింది. స్థానిక వ్యాధి నియంత్రణ సంస్థ ఒకటి సముద్ర మార్గాల నుంచి వచ్చే మాంసం పై పరీక్షలు నిర్వహించాయి.

కరోనా ఉందని తేలడంతో ఈక్వెడార్ నుంచి చైనాకు రవాణా అవుతున్న రొయ్యలను ఇప్పటికే చైనా ప్రభుత్వం నిషేధించింది. ఇటీవల బ్రెజిల్ నుంచి దక్షిణ చైనాకు దిగుమతి చేసిన మాంసంపై సాధారణ తనికీల్లో భాగంగా శాంపిళ్లను సేకరించి పరీక్షించారు. అందులో ఫ్రోజెన్ చికెన్ పై కరోనా ఆనవాళ్లను కనుగొన్నామని చైనా అధికారికంగా వెల్లడించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై చైనా బీజింగ్ లోని బ్రెజిల్ రాయబార కార్యాలయ అధికారిని నిలదీయగా వారి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని తెలిపింది.

ఈ ఘటన తర్వాత ఇతర దేశాల నుంచి వస్తున్న మాంసం, ఆహార ఉత్పత్తుల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అక్కడి స్థానిక ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తుంది. కాగా ప్రపంచంలో అమెరికా తరవాత అత్యధిక కరోనా కేసులున్న జాబితాలో బ్రెజిల్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో తమ దేశానికి కరోనాను పంపిస్తున్నారని చైనా బ్రెజిల్ పై మండిపడుతుంది. కరోనాను ముందుగానే గుర్తించినా ప్రపంచ దేశాలను హెచ్చరించకుండా నిర్లక్ష్యం చేసిన చైనా మరో దేశమైన బ్రెజిల్ నుంచి తమకు కరోనా వస్తుందని ఆరోపిస్తుండటంపై ఇతర దేశాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది.

Related News