logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా ఉధృతి.. 24 గంటల్లో భారీగా కేసులు..!

తెలంగాణలో కరోనా ఉధృతి కొనాసాగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం… 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,932 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య 11 చేరుకుంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా 17,415కు చేరాయి. మరణాల సంఖ్య మొత్తం 799కు చేరింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28,941 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఒక రోజులో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే 520 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా ఖమ్మంలో 141, నిజామాబాద్ 129, జగిత్యాల 113, మల్కాజ్‌గిరి 218, కరీంనగర్ 168, నల్గొండ 159 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 12,04,343 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒక్క రోజే 61,863 మంది శాంపిల్స్ ను సేకరించి పరీక్షించారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.83గా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 0.68గా నమోదైంది. కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య రాష్ట్రంలో 74.6గా ఉంది.

Related News