logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

శుభవార్త : కరోనా నుంచి రాష్ట్ర ప్రజలకు భారీ ఊరట

కరోనా వైరస్ తో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు ఈ మహమ్మారి నుండి భారీ ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో అంటే శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల మధ్య గల గణాంకాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో 25643 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో కేవలం 922 మందికి మాత్రమే పాజిటివ్ గా తేలింది.

అలాగే మరణాల సంఖ్య 7 గా నమోదైంది. ఇక రాష్ట్రం మొత్తంలో ఇప్పటివరకు 43,49,309 కరోనా టెస్టులు నిర్వహించారు. వారిలో 2,40,970 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,630 గా ఉంది. తాజాగా నమోదైన మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 1348కి చేరింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వెయ్యికి తక్కువగా కేసులు నమోదు కావడంతో వైరస్ నుంచి కొంత ఊరట లభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

కాగా గడిచిన 24గంటల వ్యవధిలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ నగరంలోనే 256 కరోనా కేసులు ఉన్నాయి. ఆ తరువాతి స్థానాల్లో రంగారెడ్డి 56, మేడ్చల్ 40, వరంగల్ అర్బన్ 37, సంగారెడ్డి 44, సిద్ధిపేట 33, నల్గొండ 33, కరీంనగర్ 42, భద్రాద్రి కొత్తగూడెం 37, జగిత్యాల 31 కేసులు ఉండగా మిగతా జిల్లాలో ఒకటి రెండు కేసులు బయటపడ్డాయి.

 

Related News