logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

శాకాహారులపై కరోనా ప్రభావం ఎంత?.. తాజా అధ్యయనం ఏమంటుంది?

కరోనా వైరస్ పై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ గుట్టు విప్పడానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. కాగా తాజాగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే సంస్థ చేపట్టిన ఓ అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

దేశవ్యాప్తంగా 17 నగరాల్లో ఈ పరిశోధన జరిగింది. శాస్త్రవేత్తలు వారి కుటుంబానికి చెందిన వారు ఇలా 10427 మందిపై అధ్యయనం చేశారు. వీరికి యాంటీ బడీ పరీక్షలు నిర్వహించగా.. అప్పటికే 10 శాతం మంది కోవిడ్ బారిన పడి కోలుకున్నట్లు తేలింది. 346 మందిలో మూడు నెలల తర్వాత.. 45 మందిలో ఆరు నెలల తర్వాత యాంటీబాడీలు డెవలప్ అయినట్లు గుర్తించారు.

కరోనా వైరస్ వ్యాప్తి ఎలాంటి వ్యక్తుల్లో అధికంగా ఉందనే విషయంపై ఈ అధ్యయనం జరిగింది. ఇందులో భాగంగా వారు కొన్నివిషయాలను వెల్లడించారు. సాధారణంగా రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

అయితే సొంత వాహనాల్లో ప్రయాణించే వారి కన్నా కూడా ఒకే వాహనంలో నలుగురైదుగురు కలిసి వెళ్లేవారు అధికంగా కోవిడ్ బారిన పడుతున్నట్టుగా గుర్తించారు. ఇక శాకాహారుల్లో ఈ వైరస్ వ్యాప్తి 6. 8 శాతంగా ఉండగా మాంసాహారం తీసుకునే వారిలో 11 శాతంగా ఉందని ఈ అధ్యనం వెల్లడించింది.

అదే విధంగా ఏయే బ్లడ్ గ్రూపులు ఉన్న వారు కరోనా బారిన అధికంగా పడుతున్నారనే విషయంపై కూడా ఈ పరిశోధన సాగింది. అందులో ‘ఎ’ బ్లడ్ గ్రూపు ఉన్నవారు వైరస్ బారిన ఎక్కువగా పడుతుండగా ‘ఓ’ బ్లడ్ గ్రూపు ఉన్న వారిలో ఈ వైరస్ తక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టుగా వెల్లడైంది.

Related News