logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బిగ్ బాస్ ఇంట కరోనా కలకలం..?

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి, అమితాబ్, తమన్నా వంటి తారలు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే ఎవరి ద్వారా చిరంజీవికి కరోనా సోకిందని విషయం క్లారిటీ లేదు.

చిరంజీవిని కలిసిన వారిలో రాజకీయ నేతలతో పాటుగా సినీ హీరో నటులు కూడా ఉన్నారు. చిరంజీవి అక్కినేని నాగార్జునతో కలిసి సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో వీరెవరూ మాస్కులు లేకుండా ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్తతో బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఆందోళన మొదలైంది.

నాగార్జున ఇప్పటికే బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం నాటి ఎపిసోడ్ ను కూడా ప్రసారం చేశారు. అయితే బిగ్ బాస్ లో శని, ఆది వారాలకు కలిపి ఒకే రోజు షూటింగ్ ను పూర్తి చేస్తుంటారు. దీంతో ఈ షో ద్వారా నాగార్జునకు గాని బిగ్ బాస్ సెట్ లో గాని వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. అప్పుడు షోలో ఉన్న కంటెస్టెంట్లకు కూడా కరోనా సోకె అవకాశాలు లేకపోలేదు. కాగా టెస్టుల ప్రక్రియ పూర్తయితే గాని దీనిపై ఇప్పుడే ఎలాంటి స్పష్టత లభించేలా లేదు.

Related News