logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

కరోనా కలవరం.. ఒక్కరోజే 15,968 కేసులు, 465 మరణాలు!

దేశంలో కరోనా విజృంభిస్తుంది. వైరస్ దేశంలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో అడపా దడపా కరోనా కేసులు నమోదయ్యేవి. అప్పుడే ప్రజలు భయంతో వణికిపోయారు. కానీ ఇప్పుడు దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ఎవరి నుంచి ఎవరికి వ్యాపిస్తుందో తేల్చుకోలేని పరిస్థితి ఎదురైంది. లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవుతుండటం మరోవైపు వైరస్ తిరగబెడుతుందని వచ్చే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇక రోజు రోజుకి పాజిటివ్ గా తేలుతున్న కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. నిన్న ఒక్కరోజే దేశంలో 15,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా 465 మరణాలు సంభవించాయి. వైరస్ సోకిన వారిలో 10,495 మంది కరోనా పైనుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 4,561,83 కు చేరాయి. కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,476 గా ఉంది. 2,58,684 మంది వైరస్‌ను జయించి ఇంటికి చేరారు. ఇంకా 1,83,022 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో మాత్రం కరోనా ఉధృతంగా విస్తరిస్తుంది. 1,39,010 కేసులతో మహారాష్ట్ర ముందు వరసలో నిలువగా.. ఢిల్లీ 66,602, తమిళనాడు 64,603 కేసులు నమోదయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ రాజస్థాన్ లోను కరోనా దడ పుట్టిస్తుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 800 కేసుల మార్కును దాటేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్టివ్ కేసుల సంఖ్య 5284గా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4599. కాగా మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు 10002 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగా రాష్ట్రంలోనూ కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 9553 కేసులు నమోదవ్వగా అందులో ఆక్టివ్ కేసులు 5109 గా ఉన్నాయి. 4224 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 220 మంది మరణించారు.

Related News