నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గతూ వస్తున్నాయి. ఒక వైపు గ్రేటర్ ఎన్నికల ప్రచారం, పోలింగ్ కారణంగా కరోనా కేసులు భారీగా పెరుగుతాయని ఊహించారు. కానీ అందుకు భిన్నంగా కరోనా అదుపులోకి వచ్చింది. అయితే తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.
రాష్ట్రంలో కొత్తగా 631 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,72,123 కు చేరింది.1467 మంది మరణించారు. ఇందులో 2,61,820 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 8,826 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 802 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టుగా ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న ఒక్క రోజే 109 కరోనా కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి లో 57 కేసులు నమోదయ్యాయి. అలాగే రంగారెడ్డిలో 49 కేసులు నమోదయ్యాయి.